Chandra Babu : బ‌ర్రెల‌క్క‌కి స‌పోర్ట్‌గా నేను, ప‌వ‌న్ క‌ళ్యాణ్ వెళ‌తామంటున్న చంద్ర‌బాబు

Chandra Babu : గ‌త కొద్ది రోజులుగా బ‌ర్రెల‌క్క పేరు నెట్టింట తెగ హాట్ టాపిక్ అవుతుంది. తెలంగాణ ఎన్నికల్లో ఏదైనా సెన్షేషన్ ఉందంటే అది బర్రెలక్క పోటీ మాత్రమే. చదువుకున్నప్పటికీ ఉద్యోగం రాక, బర్రెలు కాసుకుని తన అనుభవాలను రీల్స్ రూపంలో షేర్ చేస్తూ ఫేమస్ అయిన శిరీష అలియాస్ బర్రెలక్క కొల్లాపూర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగి హాట్ టాపిక్‌గా మారింది. ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆమె నిర్ణయాన్ని కొనియాడిన ఎంతోమంది ఆమెకు మద్దతుగా తరలివస్తూ ప్రచారంలో పాల్గొంటున్నారు. సొంత ఖర్చులతో ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియాలోనూ పోస్టులు పెడుతూ జనాల్లోకి తీసుకెళ్తున్నారు. కొల్లాపూర్‌లో ఇప్పుడామె పేరు మార్మోగిపోతోంది.

కొల్లాపూర్ నియోజకవర్గంలోని పెద్ద కొత్తపల్లి మండలం వెనచర్లలో స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి బర్రెలక్క తన మద్దతుదారులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తుండగా ఒక్కసారిగా ఆమె తమ్ముడిపై దుండగులు దాడి చేశారు. తన తమ్ముడిపై ఐదుగురు గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపర్చారని బర్రెలక్క కన్నీటిపర్యంతమయ్యారు. తమకు ప్రజల మద్దతు పెరగడంతో ఓట్లు చీలిపోతాయని ప్రత్యర్థులు ఇలా దాడులు చేయించడం అప్రజాస్వామికమని మండిపడ్డారు. తన తమ్ముడిపై దాడి చేసి గాయపపర్చడం దుర్మార్గమంటూ భోరున విలపించారు.

Chandra Babu gives support to barrelakka
Chandra Babu

బ‌ర్రెల‌క్క దాడి సంఘ‌ట‌న జ‌రిగిన త‌ర్వాత ఆమెకి మ‌ద్ద‌తు మ‌రింత పెరుగుతుంది. సామాన్యుల‌తో పాటు సెల‌బ్రిటీలు సైతం ఆమెకి త‌మ‌దైన స‌పోర్ట్ అందిస్తున్నారు. రీసెంట్‌గా మాజీ సీఎం చంద్ర‌బాబు నాయుడు మాట్లాడుతూ.. తెలంగాణ‌లో కేసీఆర్ అరాచకం ఎక్కువైంద‌ని, ఆయ‌న‌కి కొంద‌రు గ‌ట్టి పోటీ ఇస్తున్నారు.ఎవ‌రి స‌పోర్ట్ లేకుండా గ‌ర్జిస్తున్న బ‌ర్రెల‌క్క‌ని ప్ర‌శంసిస్తూ ఆమెకి ఎలాంటి స‌పోర్ట్ కావాల‌న్నా కూడా త‌న‌తో పాటు ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌పోర్ట్ అందిస్తామంటూ చంద్రబాబు ప‌రోక్షంగా కామెంట్స్ చేశారు. ప్ర‌స్తుతం ఆయ‌న చేసిన కామెంట్స్ వైర‌ల్‌గా మారాయి.

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

1 month ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

1 month ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago