Purandeshwari : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై వరుసగా తీవ్ర ఆరోపణలు, విమర్శలు గుప్పిస్తున్నారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురంధేశ్వరి. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి జగన్ సర్కార్ టార్గెట్‌గా ముందుకెళుతున్న ఆమె అప్పటి నుంచి వరుసగా ఒక్కొక్క ఇష్యూతో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతూ.. రాజకీయంగా ఇరకాటంలో పెడుతోంది. తాజాగా కేసీఆర్ ప్రభుత్వంపై దగ్గుబాటి పురందేశ్వరి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆమె కూకట్‌పల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… దళితబంధు స్కీమ్‌లో అవినీతి జరుగుతోందని, ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ కూడా అంగీకరించారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇక్కడ తమ మిత్రపక్ష జనసేన అభ్యర్థి ప్రేమ్ కుమార్‌ను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రేమ్ కుమార్‌ని గెలిపించాక నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు కేంద్రం నుంచి కూడా మంచి మద్దతు ఉంటుందని వెల్లడించారు. తెలంగాణలో మార్పు అవసరమని ఇక్కడి ప్రజలు భావిస్తున్నారన్నారు. బీఆర్ఎస్ ఇచ్చిన హామీలు నీటి మూటలుగా మిగిలిపోయాయని విమర్శించారు. బీజేపీ, జనసేనలు ప్రజాసమస్యలపై నిలదీసే పార్టీలని, ఈ పార్టీల అభ్యర్థులను ఆదరిస్తే ప్రజల సమస్యలకు పరిష్కారం లభిస్తుందని గుర్తించాలన్నారు. మోసపూరిత వాగ్దానాలతో రెండుసార్లు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ గురించి ప్రజలు ఓసారి ఆలోచించాలని సూచించారు. లక్ష ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ తొమ్మిదిన్నరేళ్లలో చేసిందేమీ లేదన్నారు.
టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కారణంగా అభ్యర్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో ప్రభుత్వం చెప్పాలని నిలదీశారు. పేద ప్రజలకు ఇచ్చిన డబుల్ బెడ్రూం ఇళ్ల హామీని కూడా నెరవేర్చలేదన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 9 లక్షల దరఖాస్తులు రాగా 50 వేలు మాత్రమే నిర్మించారన్నారు. మోదీ ప్రభుత్వం నాలుగు కోట్ల ఇళ్లను మంజూరు చేసి, మూడు కోట్ల ఇళ్లు నిర్మించిందన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్లలో కేంద్రం ఇచ్చిన డబ్బులు ఉన్నాయన్నారు. దళితుడిని ముఖ్యమంత్రిగా చేస్తానని చెప్పిన కేసీఆర్ ఆ తర్వాత మాట తప్పారని ధ్వజమెత్తారు. దళితులకు మూడెకరాల భూమి హామీని కూడా నెరవేర్చలేదన్నారు. దళితబంధు పథకంలో భారీ అవినీతి జరుగుతోందన్నారు. దీనిని కేసీఆర్ కూడా ఒప్పుకున్నారన్నారు. పాఠశాలలు, కాలేజీలు, యూనివర్సిటీలలో ఉపాధ్యాయులకు వేలపోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిని భర్తీ చేయటం లేదన్నారు. . పురందేశ్వరి చార్మినార్ అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి తరఫున కూడా ఇంటింటికి ప్రచారం నిర్వహించారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…