Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలతో పాటు రాజకీయాలతో బిజీగా ఉన్నారు. ఒకవైపు రాజకీయాలతో చాలా బిజీగా ఉన్నప్పటికీ అడపాదడపా సినిమా షూటింగ్స్‌లో పాల్గొంటూనే ఉన్నాడు. ప్రస్తుతం హరి హర వీరమల్లు సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్న పవన్.. ఇటీవలే సాహో డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో మరో ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ట్రిపుల్ ఆర్ మూవీ నిర్మాణ సంస్థ డీవీవీ దానయ్య ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందనుండడంతో ఈ మూవీపై అంచనాలు పెరిగిపోయాయి. ఇక మరోవైపు.. డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలోనూ పవన్ ఓ సినిమా చేయాల్సి ఉంది.
తమిళ్ స్టార్ హీరో విజయ్ నటించిన తేరి సినిమాను హరీష్ రీమేక్ చేయనున్నట్లుగా టాక్ వినిపిస్తోండగా, ఈ రూమర్స్ పై పవన్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా రీమేక్ చేసే ఆలోచన మానుకోవాలని.. ఆ మూవీ రీమేక్ అంటూ ప్రకటన మాత్రం రావొద్దంటూ సోషల్ మీడియా వేదికగా దర్శకుడికి డిమాండ్ చేస్తున్నారు. ఓ యాష్ ట్యాగ్‌ను మొదలు పెట్టారు. “వి డోంట్ వాంట్ తేరి రీమేక్” అంటూ స్టార్ట్ చేశారు. ప్రస్తుతం ఈ యాష్ ట్యాగ్ ఇండియా వ్యాప్తంగా ట్రెండ్ అవుతోంది. ఇక మరో ఫ్యాన్ అయితే ఇంకా ముందుకెళ్లి.. ఓ సూసైడ్ నోట్ కూడా రాశాడు. తేరి రీమేక్ కనుక చేస్తే.. చస్తానని.. తన చావుకు మైత్రీ మూవీ మేకర్స్‌తో పాటు హరీష్ శంకర్ కూడా భాద్యత వహించాలంటూ ఉన్న లేఖ కూడా షేర్ చేశాడు.
తేరి సినిమా పోలీసోడుగా తెలుగులో అందుబాటులో ఉంది. అలానే ఓటీటీలోను ఈ సినిమాని చాలా మంది చూశారు. ఈ క్రమంలో ఆ సినిమాని మరోసారి ఇలా ఎందుకు చేస్తున్నారని పవన్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఇక పవన్ కళ్యాణ్ రీమేక్ సినిమాలు చేయడం కొత్తేమి కాదు. ఇటీవల మలయాళం సూపర్ హిట్ సినిమా అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ చేసి భీమ్లా నాయక్ పేరుతో ప్రేక్షకుల ముందుకు రాగా, ఇందులో రానా దగ్గుబాటి.. నిత్యా మీనన్ కీలకపాత్రలలో నటించారు. వకీల్ సాబ్ చిత్రాన్ని కూడా పింక్ రీమేక్‌గా చేసిన విషయం తెలిసిందే.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…