Masooda : పెద్ద సినిమాలు సంచలనాలు సృష్టిస్తున్న నేపథ్యంలో మరోవైపు చిన్న సినిమాలు కూడా సత్తా చాటుతున్నాయి. తక్కువ బడ్జెట్ తో వచ్చిన సినిమాలు మంచి విజయాలను అందుకుంటున్నాయి. అంతే కాదు రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబడుతున్నాయి. కార్తికేయ2, కాంతారా సినిమాలు ఇందుకు ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు.. ఇక ఇప్పుడు మరో సినిమాకూడా ఈ లిస్ట్ లో చేరింది. ఆసినిమానే మసూద. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ‘మళ్ళీ రావా’, థ్రిల్లర్ ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ వంటి విభిన్న కథలతో బ్లాక్‌బస్టర్ విజయాలను అందుకున్న స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో వచ్చిన సినిమా మసూద కాగా, ఇందులో సంగీత, తిరువీర్, కావ్య కళ్యాణ్ రామ్, బాంధవి శ్రీధర్, శుభలేఖ సుధాకర్, సత్య ప్రకాశ్, సత్యం రాజేష్ తదిరులు ముఖ్య పాత్రలు పోషించారు.
మసూద చిత్రంతో సాయికిరణ్ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఈ సినిమా నవంబర్ 18న మసూద ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి విజయాన్ని అందుకోగా, ఈ మూవీని ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’ భారీ ధరకి కొనుగోలు చేసిందని.. డిసెంబరు 16 లేదా 23న స్ట్రీమింగ్‌కి ఉంచబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. డిసెంబరు 16న జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో రూపొందిన అవతార్-2 సినిమా థియేటర్లలోకి రాబోతుండగా, ఆ రోజు ఏ పెద్ద సినిమా కూడా రిలీజ్ కావడం లేదు. కాని ‘మసూద’ని ఓటీటీలో రిలీజ్ చేయాలని ఆహా భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ సినిమాలో నటించిన కావ్య కళ్యాణ్ రామ్ అందరికి గుర్తుండే ఉంటుంది. ఈ బ్యూటీ అల్లు అర్జున్ హీరోగా పరిచయమైన గంగోత్రి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. ఆ సినిమాలో హీరోయిన్ చిన్నప్పటి పాత్రలో కనిపించింది కావ్య. ఇక మసూద మూవీలో సంగీత నటనకి మంచి మార్కులు పడ్డాయి. మదర్ సెంటిమెంట్‌ని పండించడంలో ఆమె చాలా సక్సెస్ అయ్యింది. దెయ్యం పట్టిన కూతురు వింత ప్రవర్తనకి భయపడటం.. ఆమెని ఇనుప గొలుసులతో కట్టేసినప్పుడు తల్లి ప్రేమ చూపిస్తూ ఆమె ఎమోషనల్ అయ్యే తీరు ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకటటుకుంది.. ఇక తిరువీర్ ఇన్నాళ్లు ఓ టైప్ ఆఫ్ శాడిజం పాత్రల్లోనే కనిపిస్తూ వచ్చాడు. ఇప్పుడు తొలిసారి ఓ పాజిటివ్ క్యారెక్టర్‌లో చాలా చక్కగా పర్‌ఫార్మెన్స్ కనబరిచాడు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…