Pawan Kalyan Bike Price : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలు, రాజకీయాలతో బిజీగా ఉన్నారు. సినిమాల విషయానికి వస్తే పవన్ కేవలం నటనకే పరిమితం కాకుండా ఇతర క్రాఫ్ట్స్‌లోనూ తనదైన ముద్ర వేశారు. స్క్రిప్ట్ రైటింగ్ మొదలు స్టంట్ కొరియోగ్రఫీ, సాంగ్ కొరియోగ్రఫీ, దర్శకత్వం చివరికి సింగర్‌గా కూడా తన ట్యాలెంట్‌ను చూపించి అలరించారు. పలు సినిమాలకు స్క్రీన్‌ప్లే, కథ అందించిన పవన్ కళ్యాణ్ భవదీయుడు భగత్ సింగ్ చిత్రానికి కూడా ఇవ్వనున్నాడని ప్రచారం జరిగింది. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు అనే చిత్ర షూటింగ్‌తో బిజీగా ఉన్నారు.
రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. ఇక ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న పవన్ లోకేషన్ లో ఖరీదైన బైక్ పై రైడ్ చేయగా, ఈ బైక్ ధర ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారింది. హరిహర వీరమల్లు గెటప్ లో బైక్ రైడ్ చేసి అభిమానులను అబ్బురపరిచారు. పవన్ పవన్ నడిపిన ఈ బైక్ ప్రముఖ సంస్థ BMW కంపెనీ కు చెందినది. BMW R1250 GS మోడల్ కు చెందిన ఈ బైక్ ధర అక్షరాలా రూ. 24 లక్షలు. ప్రస్తుతం ఈ బైక్ పై పవన్ రైడ్ చేస్తున్న వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండటం కారణంగా కొంత ఆలస్యం అవుతుంది.
‘హరిహర వీరమల్లు’ చిత్రం స్టార్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది ఈ చిత్రం. తాజా ఈ చిత్ర షూటింగ్ లో పాల్గొన్నారు పవర్ స్టార్. ‘హరిహర వీరమల్లు’ చారిత్రాత్మక ప్రాముఖ్యత కలిగిన చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన భారీ సెట్‌లో ‘హరి హర వీరమల్లు’ చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. 900 మంది నటీనటులు, సిబ్బంది చిత్రీకరణలో పాల్గొన్నారు. నిధి అగర్వాల్ ఇందులో కథానాయికగా నటిస్తోంది. సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణీ మ్యూజిక్ అందిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చిలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చే ఆలోచన చేస్తున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…