Pavitra Lokesh Naresh : గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాలలో పవిత్ర లోకేష్, నరేష్‌ల పేర్లు తెగ మారుమ్రోగిపోతున్నాయి. మొన్నటి వరకు కలిసి జంటగా కనిపించని వీరు ఇటీవల మాత్రం ఎక్కడకి వెళ్లిన జంటగానే వెళుతున్నారు. కృష్ణ మృతి సమయంలో వీరిద్దరి ప్రవర్తనపై చాలా ట్రోలింగ్ నడిచింది. ఈ క్రమంలో తనపై కొన్ని యూట్యూబ్ ఛానళ్లు అసత్య ప్రచారం చేస్తున్నాయని.. నరేష్‌తో ముడిపెడుతూ అసభ్యకరంగా ట్రోల్స్ చేస్తున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులకు ఇటీవల పవిత్ర లోకేష్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే.. పవిత్ర లోకేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఇప్పటికే పలు యూట్యూబ్ ఛానళ్లు, పలు వెబ్‌సైట్లకు కూడా నోటీసులు జారీ చేశారు.
ఈ విషయంలోనే నరేష్.. నాంపల్లి కోర్టులో యూట్యూబ్ ఛానళ్లతో పాటు కొంత మందిపై క్రిమినల్ డిఫమేషన్ పిటిషన్ వేశారు ఈ పిటిషన్‌పై స్పందించిన నాంపల్లి కోర్టు.. పిటిషన్‌లో నరేష్ పేర్కొన్న 12 మందిపై విచారణ చేపట్టాలని సైబర్ క్రైమ్ పోలీసులకు నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేయడంతో పాటు నరేష్ పేర్కొన్న 12 మందికి మరోసారి నోటీసులు జారీ చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు. ఇమండి టాక్స్ రామారావ్, రెడ్ టీవీ, లేటెస్ట్ తెలుగు డాట్ కామ్, లైఫ్ ఇన్‌స్ప్రెషన్, రమ్య రఘుపతి, మూవీ న్యూస్, ది న్యూస్ క్యూబ్, తెలుగు న్యూస్ జర్నలిస్ట్, దాసరి విజ్ఞాన్, కృష్ణ కుమారి, నిరాదరణ కథనాలు ప్రసారం చేస్తున్న కొన్ని యూట్యూబ్ ఛానల్స్, మీడియా సంస్థలపై ఆధారాలతో సహా ఫిర్యాదు చేయగా, దీనిపై ఇప్పుడు విచారణ జరుగుతుంది.
ఈ దుష్ప్రచారం వెనుక రమ్య రఘుపతి హస్తం ఉందని పవిత్ర లోకేష్ కంప్లైంట్ చేయడంతో ఆమె పేరు కూడా పొందుపరిచారు. కాగా, కొన్ని వెబ్‌సైట్లు ఫొటోలని మార్ఫింగ్ చేసి.. వైరల్ చేస్తున్నాయని పవిత్ర లోకేష్ ఫిర్యాదులో పేర్కొన్న విషయం తెలిసిందే.. ఈ చర్యలన్నీ తమ ప్రైవసీకి భంగం వాటిల్లేలా ఉన్నాయని తెలియజేస్తూ.. పలు ఆధారాలని కూడా పవిత్ర లోకేష్ ఫిర్యాదుకి జత చేశారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…