Waltair Veerayya : మెగాస్టార్ చిరంజీవి.. పూర్తి స్థాయి మాస్ ఎంటర్టైనర్ చేసి చాలా రోజులవుతుంది. ఖైదీ నెంబర్ 150 తర్వాత ఆ రేంజ్ మాస్ సినిమా చేయలేదు. అందులోను ఆయన రీమేక్ చిత్రాలు చేస్తుండడంతో ఫ్యాన్స్ అసంతృప్తిగా ఉన్నారు. అయితే ఎట్టకేలకు మాస్ యాక్షన్ సినిమా వాల్తేరు వీరయ్య చిత్రంతో సంక్రాంతికి పలకరించబోతున్నాడు చిరు. ఇప్పటికే మెగాస్టార్ పరిచయం చేసిన టీజర్, పాటలు సూపర్ హిట్టయ్యాయి. తాజాగా మాస్ మహారాజా రవితేజ లుక్‌ను విడుదల చేసింది చిత్రబృందం. దీంతో డబుల్ మాస్‌తో ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ అందించారు.
రవితేజకి సంబంధించిన టీజర్‌ను గమనిస్తే.. రవితేజ ఓ చేతిలో మేకపిల్ల, మరోక చేతిలో గొడ్డలి పట్టుకుని ఫుల్ యాక్షన్ మోడ్‌లో కనిపించారు. “ఫస్ట్ టైమ్ ఓ మేకపిల్లను ఎత్తుకొని పులి వస్తోంది.” అనే డైలాగ్‌తో టీజర్ మొదలు కాగా, “ఏమిరా వారి పిస పిస జేస్తున్నవ్.. నీకింకా సమజ్ కాలే.. నేను ఎవ్వని అయ్యకీ ఇననని” అంటూ తెలంగాణ యాసలో రవితేజ డైలాగ్‌కు అభిమానులు తెగ ఫిదా అవుతున్నారు.అయితే రవితేజది కథలో కీలకమైన పూర్తి స్థాయి పాత్ర. టీజర్ రిలీజ్ అయ్యాక రవితేజ పాత్రకు సంబంధించిన అనేకప్రచారాలు సాగుతున్నాయి.
వాల్తేరు వీరయ్యకు వైజాగ్ సాగరతీరంలో ఎదురుండదు. అతడు మంచోళ్ళకు మంచోడు చెడ్డోళ్లకు చెడ్డోడు. తన వాళ్ళ జోలికి వస్తే చుక్కలు చూపించడం ఖాయం. గూండాలని హడలెత్తించే వీరయ్య జనానికి దేవుడు. పేద ప్రజల కోసం వాల్తేరు వీరయ్య ఎలాంటి పనులైనా చేస్తాడు. అయితే ఆయనకు అడ్డుకట్ట వేసేందుకు విక్రమ్ సాగర్ ఏసీపీ బరిలోకి దిగుతాడు. వాల్తేరు వీరయ్యకు కోపం తెప్పించాలి. అతన్ని ఏమీ చేయాలేని నిస్సహాయ స్థితిలో చూడాలి అనుకుంటాడు. అయితే వాల్తేరు వీరయ్యను విక్రమ్ సాగర్ టార్గెట్ చేయడానికి… ఏసిపీగా వైజాగ్ లో దిగడానికి పెద్ద కథే ఉంటుంది. అసలు వాల్తేరు వీరయ్యకు-విక్రమ్ కి ఉన్న సంబంధం ఏమిటి? అనేదే కథలో అసలు ట్విస్ట్ అని తెలుస్తుంది. దీనికి మరి కొద్ది రోజులలో క్లారిటీ రానుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…