Babar Azam : క్రికెట్ ఫ్యాన్స్ అంటే అంతే. గెలిచినప్పుడు తమ దేశ ప్లేయర్లు కింగులని.. వాళ్లంతటి వారు లేరని పొగుడుతారు. కానీ ఓడినప్పుడు మాత్రం దాన్ని క్రీడగా చూడరు. దారుణంగా ట్రోల్ చేస్తారు. ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉండడంతో ప్లేయర్లు ఏ మ్యాచ్‌లోనైనా విఫలం అయితే వారిపై ట్రోలింగ్ ఎక్కువవుతోంది. కేవలం క్రీడలు మాత్రమే కాదు.. ఇతర రంగానికి చెందిన సెలబ్రిటీలు కూడా ప్రస్తుతం ట్రోలింగ్ నుంచి తప్పించుకోలేకపోతున్నారు. అయితే సోషల్ మీడియాలో జరిగే ట్రోలింగ్ ఒకెత్తయితే నేరుగా జరిగే అవమానాలు మరొక ఎత్తు. సెలబ్రిటీ కనిపిస్తే చాలు.. పెద్దగా అరుస్తూ ట్రోల్ చేస్తున్నారు. తాజాగా పాక్ క్రికెటర్, కెప్టెన్ బాబర్ అజమ్‌కు గ్రౌండ్‌లోనే చేదు అనుభవం ఎదురైంది.
ప్రస్తుతం పాక్ తన సొంత దేశంలో ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్ ఆడుతోంది. అందులో భాగంగానే తాజాగా రెండో టెస్టు కూడా పూర్తయింది. మొదటి టెస్టులో ఘోర ఓటమి పాలైన పాక్‌కు రెండో టెస్టులో గెలిచే అవకాశం వచ్చింది. వికెట్లను కాపాడుకుని ఉంటే టార్గెట్‌ను సులభంగా ఛేదించేవారే. కానీ వికెట్లను కోల్పోవడంతో కేవలం 26 పరుగుల తేడాతో మ్యాచ్‌ను కోల్పోయింది. దీంతో 3 మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లండ్ 2-0తో ఇప్పటికే సిరీస్‌ను చేజిక్కించుకుంది. అయితే రెండో టెస్టులో పాక్ కెప్టెన్ బాబర్ ఆజం తొలి ఇన్నింగ్స్‌లో 75 పరుగులు చేసి ఫర్వాలేదనిపించినా.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం 1 పరుగు మాత్రమే చేశాడు. దీంతో అతను ఔట్ అయి పెవిలియన్ వైపు వెళ్తున్న సమయంలో స్టేడియంలో పక్కనే స్టాండ్స్‌లో ఉన్న కొందరు ప్రేక్షకులు తమ అసహనాన్ని వెళ్లగక్కారు. బాబర్ ఆజంను ట్రోల్ చేశారు.
బాబర్ ఆజం స్టాండ్స్ నుంచి వెళ్తుండగా.. జింబాబర్.. జింబాబర్.. అని నినాదాలు చేశారు. అవన్నీ ఆ సమయంలో తీసిన వీడియోలో స్పష్టంగా వినిపించాయి. దీంతో ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇక పాక్ తన మూడో టెస్ట్‌ను డిసెంబర్ 17వ తేదీ నుంచి ఆడనుంది. ఈ టెస్ట్ మ్యాచ్ కరాచీలో జరుగుతుంది. చాలా ఏళ్ల తరువాత సొంత దేశంలో మ్యాచ్‌లను ఆడుతున్నప్పటికీ పాక్ మాత్రం పరాజయాల బాటలోనే నడుస్తుండడంతో ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి మూడో టెస్టులో అయినా గెలిచి పరువును కాపాడుకుంటుందో లేదో చూడాలి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…