వందల సినిమాలలో నటించి ఎంతో మంది ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారు పావలా శ్యామల. ఆమె జీవితం చూస్తూ సినిమాల్లో మాదిరిగానే ఉంటుంది. అసలు సినిమా వాళ్ల జీవితాలు తెరమీద కనిపించేంతా అందరంగా ఉండవు.. ముఖాన మేకప్ వేస్తేనే కడుపు నిండుతుంది.. లేదంటే అంతే. బిగ్ స్టార్స్, క్యారెక్టర్ ఆర్టిస్టుల లగ్జరీ లైఫ్ వేరు కానీ.. చిన్నా చితకా పాత్రలు వేసే వాళ్లవి మాత్రం చితికిపోయే బ్రతుకులే అని చాలా సందర్భాలలో మనం చూశాం. తెలుగులో ఏకంగా 300 సినిమాలకు పైగా పలు వైవిధ్యమైన పాత్రల్లో నటించిన పావలా శ్యామల, తనదైన యాక్టింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది.
ఆమె చేసిన కొన్ని పాత్రలు ఆమె కెరీర్ లోనే ది బెస్ట్ గా నిలిచాయి. అయితే ఆమెను ప్రస్తుతం వృద్ధాప్య సమస్య ఇబ్బంది పెడుతోంది. సినిమాల్లో అవకాశాలు లేకపోవడంతో ప్రస్తుతం ఆమె జీవితాన్ని గడపడం చాలా కష్టంగా మారిపోయిందని వాపోతోంది. తన ఆరోగ్యం బాగోలేకపోవడం.. తన కూతురు కూడా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంది. గతంలో ‘మా’లో మెంబర్‌షిప్‌ను లక్ష రూపాయలు వెచ్చించి మెగాస్టార్ చిరంజీవి ఇప్పించారని.. అలాగే తన కూతురి ఆరోగ్యం గురించి తెలుసుకుని మరో రెండు లక్షల ఆర్థిక సాయం చేశారని ఆమె తెలిపింది.
అప్పట్లో అందరూ చేసిన సాయంతో ఇప్పటిదాకా నెట్టుకొచ్చామని.. మళ్లీ పాత రోజులు వచ్చాయని వెల్లడించింది. మాకు బతుకుదెరువు లేదని ఆత్మహత్యే శరణ్యమని వాపోయింది. ప్రస్తుతం ‘మా’ నుంచి తనకు ఎలాంటి సహాయం అందలేదని తెలిపింది. మంచు విష్ణు ‘మా’ ప్రెసిడెంట్ అయ్యాక తనను చూసుకునేందుకు ఒక అమ్మాయిని పెట్టారని పావలా శ్యామల తెలిపింది. అయితే ఆమె మధ్యలోనే వదిలేసి వెళ్లిపోగా, ఇప్పుడు పట్టించుకున్న నాథుడే లేడని ఏడ్చేసింది. అప్పట్లో కరాటే కల్యాణి మా ఇంటికి వచ్చి మా ఇల్లు చూసి చీదరించుకుంది. అంతేకాదు తప్పుగా కూడా ప్రచారం చేసిందంటూ చాలా బాధపడింది. తమను ఎవరైన ఆదుకోవాలి అంటూ పావలా శ్యామలా కోరుతుంది.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…