Papaya Seeds : బొప్పాయి పండ్లలో మనకు ఆరోగ్యకర ప్రయోజనాలనిచ్చే ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. వాటిలో మన శరీరానికి పనికొచ్చే ఎన్నో కీలక పోషకాలు కూడా ఉంటాయి. అవి మనకు కలిగే పలు అనారోగ్య సమస్యలను నయం చేస్తాయి. శరీర నిర్మాణానికి దోహదం చేస్తాయి. అయితే కేవలం బొప్పాయి పండు మాత్రమే కాదు, దాని విత్తనాలు కూడా మనకు ఉపయోగకరమే. అవును, మీరు విన్నది నిజమే. చాలా మందికి ఈ విషయం తెలియదు. నిజానికి బొప్పాయి పండ్లను తిన్నాక చాలా మంది విత్తనాలను పారేస్తారు కానీ విత్తనాలను కూడా తినవచ్చు. ఈ క్రమంలోనే వాటిని తినడం వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
నిత్యం ఉదయాన్నే పరగడుపునే రెండు స్పూన్ల బొప్పాయి విత్తనాలను రోజూ తింటుంటే మధుమేహం, హార్ట్ ఎటాక్, క్యాన్సర్ లాంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. కిడ్నీ, కాలేయ సమస్యలు పోతాయి. జీర్ణ వ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది. బొప్పాయి పండు విత్తనాలను తింటే శరీరంలో ఉండే వ్యర్థ పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. శరీరం అంతర్గతంగా శుభ్రంగా తయారవుతుంది. పలు అవయవాల్లో ఉండే వ్యర్థాలు తొలగింపబడతాయి.
శరీర బరువును తగ్గించడంలో బొప్పాయి విత్తనాలు ఎంతో పనిచేస్తాయి. బొప్పాయి విత్తనాల వల్ల జీర్ణాశయంలో ఉండే క్రిములు నాశనమవుతాయి. దీని వల్ల ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. ప్రధానంగా కడుపులో ఉండే పలు రకాల పురుగులు నశిస్తాయి. బొప్పాయి విత్తనాల్లో ఉండే ఔషధ గుణాలు శరీర బరువును తగ్గిస్తాయి. శరీర మెటబాలిజం రేటును పెంచడం వల్ల బరువు త్వరగా తగ్గుతారు. బొప్పాయి విత్తనాలతో కండరాలు దృఢంగా మారుతాయి. నిత్యం మన తినే ప్రోటీన్లు సక్రమంగా వినియోగమవుతాయి. అందువల్ల కండరాల సమస్యలు పోవడమే కాదు, కండరాలు చక్కగా నిర్మాణమవుతాయి. నిత్యం పని ఒత్తిడి కారణంగా కలిగే అలసట తగ్గుతుంది. దీంతో రోజంతా యాక్టివ్‌గా పనిచేయవచ్చు. ఉత్సాహంగా ఉంటారు.
బొప్పాయి విత్తనాల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. దీంతో పలు రకాల ఇన్‌ఫెక్షన్లు నయమవుతాయి. ప్రధానంగా జ్వరం, జలుబు, దగ్గు వంటివి రావు. బొప్పాయి విత్తనాలు పురుషుల్లో వీర్య నాణ్యతను పెంచుతాయి. శృంగార సామర్థ్యాన్ని రెట్టింపు చేస్తాయి. ఎవరైనా బొప్పాయి విత్తనాలను రోజుకు 2 టేబుల్ స్పూన్ల మోతాదులో తీసుకోవచ్చు. అయితే విత్తనాలను డైరెక్ట్‌గా తినలేమని అనుకునే వారు వాటిని పొడి చేసుకుని దాన్ని మజ్జిగ లేదా ఏదైనా సలాడ్‌లో కలుపుకుని తినవచ్చు. ఇలా తిన్నా పైన చెప్పిన విధంగా లాభాలు కలుగుతాయి.
ఐదు లేదా 6 బొప్పాయి విత్తనాలను తీసుకుని వాటిని నలిపి ఏదైనా పండ్ల రసం లేదా నిమ్మరసంతో కలిపి తీసుకోవాలి. నెల రోజుల పాటు ఇలా చేస్తే లివర్ శుభ్ర పడుతుంది. శరీరంలోని విష పదార్థాలన్నీ బయటకు వెళ్లిపోతాయి. బొప్పాయి విత్తనాలను తరచూ తింటుంటే కిడ్నీ సంబంధ సమస్యలను దూరం చేసుకోవచ్చు. బొప్పాయి విత్తనాల్లో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి నొప్పులు, వాపులను తగ్గిస్తాయి. ప్రధానంగా కీళ్ల నొప్పులతో బాధ పడుతున్న వారికి ఇవి ఎంతగానో మేలు చేస్తాయి. యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు కూడా బొప్పాయి విత్తనాలకు ఉన్నాయి. ఈ-కొలి వంటి బాక్టీరియాలను నిర్మూలించడంలో ఇవి మెరుగ్గా పనిచేస్తాయి. డెంగ్యూ, టైఫాయిడ్ వంటి వ్యాధులు రాకుండా అడ్డుకుంటాయి.
క్యాన్సర్ కణాలు, ట్యూమర్లు వృద్ధి చెందకుండా చూస్తాయి. పలు క్యాన్సర్లను అడ్డుకునే శక్తి బొప్పాయి విత్తనాలకు ఉంది. అప్పుడే సంతానం వద్దనుకునే వారికి ఇవి కాంట్రాసెప్టివ్ మాత్రల్లా ఉపయోగపడతాయి. వీటిని తింటుంటే మహిళలు అంత త్వరగా గర్భం దాల్చలేరు. ఇలా బొప్పాయి పండు విత్తనాలను తినడం వల్ల ఎన్నో అద్భుతమైన లాభాలను పొందవచ్చు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…