Posani Krishnamurali : ఇప్పుడు ఏపీ రాజకీయాలు మంచి హీట్ మీదున్నాయి. 40 ఇయర్స్ పొలిటికల్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు, జైలుకు వెళ్లిన తరువాత రాజకీయం మరింత హీటెక్కింది. అధికార పార్టీ నేతలు చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు. అవినీతి చక్రవర్తి అయిన చంద్రబాబు పాపం పడిందని, ఇక ఆయన జీవితాంతం జైల్లోనే ఉంటాడంటూ వైసీపీ నేతలు ఘాటుగా విమర్శిస్తుండగా, ఈ సింపతీ చంద్రబాబుకి బాగా వర్కవుట్ అవుతుందని మరికొందరు అంటున్నారు. అయితే చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఇటీవల కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు జైల్లో ఉండి కూడా ప్రజలు, రాష్ట్రం గురించే ఆలోచిస్తున్నారని ఆమె తెలిపారు. అయితే ఈ వ్యాఖ్యలపై ఏపీఎఫ్ డీసీ ఛైర్మన్ పోసాని కృష్ణమురళి మండిపడ్డారు.
రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ సెలవులో వెళ్లడంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైసీపీ నేత, ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళి విమర్శించారు. పోసాని కృష్ణ మురళి మీడియాతో మాట్లాడుతూ.. రామోజీ రావు ఆయన పేపర్‌తో రాజకీయ వ్యభిచారం చేస్తున్నారని ఆరోపించారు. రాజమండ్రి జైలు సూపరింటెండెంట్ రాహుల్ భార్య చనిపోతే రాజకీయం చేస్తారా? అని ప్రశ్నించారు. జైలు సూపరింటెండెంట్ రాహుల్ ఆయన భార్యకు అనారోగ్యంగా ఉండటంతోనే సెలవుపై వెళ్లారని చెప్పారు. రామోజీరావు చనిపోతే అతని కుమారుడు కిరణ్ వెళ్లడా? అని ప్రశ్నించారు. రాహుల్ సెలవుపై వెళ్లడంతో జైలుకుకొత్త అధికారి వస్తే మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ బంధువు అని.. అతనిపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
చంద్రబాబును జైలులో కలిసిన ఆయన సతీమణి భువనేశ్వరి జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమె భర్త ప్రజల కోసమే పనిచేశారని చెప్పారని అన్నారు. అయితే చంద్రబాబు కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి చేరింది ప్రజల కోసమేనా?, కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు డబ్బులు పంపింది ప్రజల కోసమేనా? అని ప్రశ్నించారు. ఎన్టీఆర్‌పై చెప్పుల దాడి చేయించింది, అక్రమంగా అధికారం లాక్కుంది చంద్రబాబు అని గుర్తులేదా? అని ప్రశ్నించారు. నందమూరి బాలకృష్ణ ఇద్దరిని పిట్టలు కాల్చినట్టుగా కాల్చిపారేశాడని పోసాని కృష్ణమురళి ఆరోపించారు. వారు బుల్లెట్స్ దిగి చావు బతుకుల్లో ఆస్పత్రిలో ఉంటే.. పోలీసు స్టేషన్‌లో ఉండాల్సిన బాలకృష్ణ.. కానీ బాలకృష్ణకు ఎందుకు శిక్ష పడలేదని ప్రశ్నించారు. మీనాన్న ను వెన్నుపోటు పొడిచింది ప్రజల కోసమేనా అని ప్రశ్నించారు పోసాని. ఎన్టీఆర్ పదవీని చంద్రబాబు అక్రమంగా లాక్కున్నారని.. ఎన్టీఆర్ పై చెప్పులతో చేయించింది కూడా చంద్రబాబే అన్నారు. ఈ విషయాలు నారా భువనేశ్వరికి గుర్తుకు లేవా అని నిలదీశారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…