Pallavi Prashanth : అజ్ఞాతంలోకి ప‌ల్ల‌వి ప్రశాంత్.. వీడియోతో వ‌చ్చిన అస‌లు క్లారిటీ..!

Pallavi Prashanth : యూట్యూబ‌ర్ ప‌ల్ల‌వి ప్ర‌శాంత్ పేరు ఒక‌ప్పుడు అంత‌గా తెలిసేది కాదు. కాని ఇప్పుడు ఆయ‌న పేరు మారు మ్రోగిపోతుంది. బిగ్ బాస్ సీజన్ సెవెన్ విన్నర్ గా ఉన్న పల్లవి ప్రశాంత్ అనేక వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్న సంగతి తెలిసిందే. ఆయన మీద పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేయగా ఇప్పటికే డ్రైవర్లను అరెస్ట్ చేశారు. ప‌ల్లవి ప్ర‌శాంత్‌ని కూడా అరెస్ట్ చేసేందుకు ఇంటికి వెళితే అక్కడ లేడని పరారీలో ఉన్నాడని మీడియాలో ప్రచారం జరుగుతుంది. అయితే ఈ విషయం మీద స్పందిస్తూ ప్రశాంత్ ఒక వీడియో రిలీజ్ చేశాడు.

ప్రస్తుతం బిగ్‌బాస్‌-7 విన్నర్‌ పల్లవి ప్రశాంత్‌ అజ్ఞాతంలో ఉన్నారని, కేసులు నమోదుకాగానే ప్రశాంత్‌ కనిపించకుండాపోయారు అంటే ప్ర‌చ‌రం జరిగింది. ప్రశాంత్‌ లాయర్‌ జూబ్లీహిల్స్‌ పీఎస్‌కు వచ్చి కేసు వివరాలు సేకరించారు.. జూబ్లీహిల్స్‌ పోలీసులు స్పందించకపోతే డీజీపీ కార్యాలయానికి వెళ్లేందుకు ప్రశాంత్ లాయర్ రాజ్‌కుమార్‌ సిద్దమయ్యారు. కేసుల వివరాలు ఆన్‌లైన్‌లో పెట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఎవ‌రు ఊహించ‌ని విధంగా బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఫైనలిస్ట్ గా మారి చివరికి కప్పు కూడా దక్కించుకున్నాడు ప్ర‌శాంత్ . ఇక కప్పు దక్కించుకున్న తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ బయట పరిస్థితి బాలేదని పోలీసులు వెనుక గేట్ నుంచి ప్రశాంత్ అండ్ కోని పంపించేశారు.

Pallavi Prashanth finally came before media and said he is ok
Pallavi Prashanth

అయితే తాను గెలిచాను ఎవరికో భయపడి వెళ్ళిపోయేదేంటి అని పల్లవి ప్రశాంత్ పోలీసులు చెబుతున్న వినకుండా మరోసారి అన్నపూర్ణ స్టూడియోస్ వద్దకు వచ్చాడు. అప్పటికే పెద్ద ఎత్తున పల్లవి ప్రశాంత్ అభిమానులుగా చెబుతున్న చాలామంది అమరదీప్ గీతు అశ్విని , వారి కారులను ధ్వంసం చేసి దాదాపు 6 ఆర్టీసీ బస్సుల అద్దాలు కూడా ధ్వంసం చేశారు. ఈ క్రమంలో పోలీసులు ప్రశాంత్‌ని అక్కడి నుంచి వెళ్ళిపోమని చెబుతున్న వినకుండా అక్క‌డకి వ‌చ్చి ర‌చ్చ చేశారు. దాంతో ఆయ‌న‌పై కేసు న‌మోదు చేశారు. కేసు న‌మోదైంద‌ని ప్ర‌శాంత్ పారిపోయాడంటూ జ‌రిగిన ప్ర‌చారంలో ఆయ‌న స్పందించారు. అన్నా నేను ఎక్కడికి పోలే… అన్ని తప్పుడు సమాచారాలు.. నేను ఇంటికాడనే ఉన్నాను… అంటూ చెప్పుకువచ్చాడు. ఆ తర్వాత గ్రామస్థుల దగ్గరకు వెళ్లి వాళ్లతో మాట్లాడించారు. వాళ్లంతా ప్రశాంత్ ఇక్కడే ఉన్నాడు అని చెప్పుకువచ్చారు. ఆ తర్వాత ప్రశాంత్ ఓ మాల వేసుకున్న అతని దగ్గరకు వెళ్లి మాట్లాడించారు. ఆ వ్యక్తి మాట్లాడుతూ… పడి పూజ ఉండటం వల్ల అక్కడికి వచ్చాడు అని ఆయన చెప్పుకువచ్చాడు. ఇక అక్కడి గ్రామస్థులతో కూడా మాట్లాడించాడు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago