Pallavi Prashanth : యూట్యూబర్ పల్లవి ప్రశాంత్ పేరు ఒకప్పుడు అంతగా తెలిసేది కాదు. కాని ఇప్పుడు ఆయన పేరు మారు మ్రోగిపోతుంది. బిగ్ బాస్ సీజన్ సెవెన్ విన్నర్ గా ఉన్న పల్లవి ప్రశాంత్ అనేక వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్న సంగతి తెలిసిందే. ఆయన మీద పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేయగా ఇప్పటికే డ్రైవర్లను అరెస్ట్ చేశారు. పల్లవి ప్రశాంత్‌ని కూడా అరెస్ట్ చేసేందుకు ఇంటికి వెళితే అక్కడ లేడని పరారీలో ఉన్నాడని మీడియాలో ప్రచారం జరుగుతుంది. అయితే ఈ విషయం మీద స్పందిస్తూ ప్రశాంత్ ఒక వీడియో రిలీజ్ చేశాడు.
ప్రస్తుతం బిగ్‌బాస్-7 విన్నర్ పల్లవి ప్రశాంత్ అజ్ఞాతంలో ఉన్నారని, కేసులు నమోదుకాగానే ప్రశాంత్ కనిపించకుండాపోయారు అంటే ప్రచరం జరిగింది. ప్రశాంత్ లాయర్ జూబ్లీహిల్స్ పీఎస్‌కు వచ్చి కేసు వివరాలు సేకరించారు.. జూబ్లీహిల్స్ పోలీసులు స్పందించకపోతే డీజీపీ కార్యాలయానికి వెళ్లేందుకు ప్రశాంత్ లాయర్ రాజ్‌కుమార్ సిద్దమయ్యారు. కేసుల వివరాలు ఆన్‌లైన్‌లో పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఎవరు ఊహించని విధంగా బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఫైనలిస్ట్ గా మారి చివరికి కప్పు కూడా దక్కించుకున్నాడు ప్రశాంత్ . ఇక కప్పు దక్కించుకున్న తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ బయట పరిస్థితి బాలేదని పోలీసులు వెనుక గేట్ నుంచి ప్రశాంత్ అండ్ కోని పంపించేశారు.
![Pallavi Prashanth : అజ్ఞాతంలోకి పల్లవి ప్రశాంత్.. వీడియోతో వచ్చిన అసలు క్లారిటీ..! Pallavi Prashanth finally came before media and said he is ok](http://3.0.182.119/wp-content/uploads/2023/12/pallavi-prashanth.jpg)
అయితే తాను గెలిచాను ఎవరికో భయపడి వెళ్ళిపోయేదేంటి అని పల్లవి ప్రశాంత్ పోలీసులు చెబుతున్న వినకుండా మరోసారి అన్నపూర్ణ స్టూడియోస్ వద్దకు వచ్చాడు. అప్పటికే పెద్ద ఎత్తున పల్లవి ప్రశాంత్ అభిమానులుగా చెబుతున్న చాలామంది అమరదీప్ గీతు అశ్విని , వారి కారులను ధ్వంసం చేసి దాదాపు 6 ఆర్టీసీ బస్సుల అద్దాలు కూడా ధ్వంసం చేశారు. ఈ క్రమంలో పోలీసులు ప్రశాంత్‌ని అక్కడి నుంచి వెళ్ళిపోమని చెబుతున్న వినకుండా అక్కడకి వచ్చి రచ్చ చేశారు. దాంతో ఆయనపై కేసు నమోదు చేశారు. కేసు నమోదైందని ప్రశాంత్ పారిపోయాడంటూ జరిగిన ప్రచారంలో ఆయన స్పందించారు. అన్నా నేను ఎక్కడికి పోలే… అన్ని తప్పుడు సమాచారాలు.. నేను ఇంటికాడనే ఉన్నాను… అంటూ చెప్పుకువచ్చాడు. ఆ తర్వాత గ్రామస్థుల దగ్గరకు వెళ్లి వాళ్లతో మాట్లాడించారు. వాళ్లంతా ప్రశాంత్ ఇక్కడే ఉన్నాడు అని చెప్పుకువచ్చారు. ఆ తర్వాత ప్రశాంత్ ఓ మాల వేసుకున్న అతని దగ్గరకు వెళ్లి మాట్లాడించారు. ఆ వ్యక్తి మాట్లాడుతూ… పడి పూజ ఉండటం వల్ల అక్కడికి వచ్చాడు అని ఆయన చెప్పుకువచ్చాడు. ఇక అక్కడి గ్రామస్థులతో కూడా మాట్లాడించాడు.