CM Revanth Reddy : హ‌రీష్ రావు కామెంట్స్‌కి దిమ్మ‌తిరిగే స‌మాధానం ఇచ్చిన రేవంత్ రెడ్డి..!

CM Revanth Reddy : ఈ రోజు కూడా అసెంబ్లీలో చాలా వాడి వేడి చర్చ న‌డిచింది. హ‌రీష్ రావుని టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ నాయ‌కులు విరుచుకుప‌డ్డారు.బుధవారం ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయగా.. బీఆర్ఎస్ నుంచి హరీశ్ రావు మాట్లాడారు. ఈ సందర్భంగా పలు అంశాలను ప్రస్తావించారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడే సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మైక్ తీసుకున్నారు.సభను తప్పుదోవ పట్టించేలా హరీశ్ రావు మాట్లాడుతున్నారని సీఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పులపై తప్పులు మాట్లాడుతున్నారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందన్నారు. కాళేశ్వరం అంచనా రూ. 80 వేల కోట్లు కాదన్నారు. వేల కోట్ల అప్పులను తీసుకొచ్చి… ఇప్పుడు తప్పుగా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. ఇప్పుటికైనా తప్పులు ఒప్పుకోవాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి.

కాళేశ్వరంపై వెంటనే సెట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని.. నిప్పులో కాల్చితేనే బంగారం విలువ తెలుస్తుందని ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. కొత్త సీఎంకు విషయం అర్థం కావడానికి కొంత సమయం పడుతుందన్నారు. కాళేశ్వరం కార్పొరేషన్ కింద తీసుకున్న అప్పు కేవలం కాళేశ్వరం కోసమే ఖర్చు చేయలేదన్నారు. పాలమూరు ప్రాజెక్టుకు కూడా ఖర్చు చేశామన్నారు. ‘‘మీ విజ్ఞతను వినియోగించి సంపదను సమకూర్చుకోండి.. కానీ మా మీద నెపం నెట్టి తప్పించుకోకండి. రాష్ట్ర పరపతిని దిగజార్చకండి. రాష్ట్ర భవిష్యత్తును అంధకారం చేయకండి’’ అంటూ హరీష్‌రావు హితవు పలికారు.

CM Revanth Reddy strong counter to harish rao
CM Revanth Reddy

అప్పుడు సీఎం స్పందిస్తూ.. 2014నుంచి 16వరకు హరీష్ రావు నీటిపారుదుల శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత కేసీఆర్ చేశారు. నీటిపారుదల శాఖ మంత్రిగా తొమ్మిదిన్నర ఏళ్ళు వారి కుటుంబం తప్ప మరెవరు చేయలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.80 వేల కోట్లు కాదు. కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్‌కు రూ.97,449 కోట్లు. ఇవి కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత ఖర్చు చేసింది. హరీష్ రావు సభను తప్పుదోవ పట్టిస్తున్నారు. 2014కు ముందు ప్రజలు మంచినీరు తాగలేదా? బీఆర్‌ఎస్ వచ్చాకనే మంచినీళ్లు తాగినట్లు చెబుతున్నారు. మిషన్ భగీరథ వల్ల ఐదు వేల కోట్ల ఆదాయం వస్తుందని మభ్యపెట్టి లోన్లు తెచ్చారు. అప్పులు చేసిన విషయాన్ని అంగీకరించకుండా దబాయిస్తున్నారు. అత్యధిక వడ్డీలకు అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని అప్పుల కూపంగా మార్చారని కాగ్ చెప్పింది’’ అని సీఎం రేవంత్ పేర్కొన్నారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago