Nagarjuna : ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 7 కార్యక్రమం ఇటీవల గ్రాండ్‌గా ముగిసింది. ఇందులో విజేతగా పల్లవి ప్రశాంత్ గెలిచారు. అయితే రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్‌పై హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. బిగ్ బాస్ 7 గ్రాండ్ ఫినాలే సందర్భంగా ఆదివారం రాత్రి అన్నపూర్ణ స్టూడియోస్ సమీపంలో అభిమానులు సృష్టించిన బీభత్సాన్ని సుమోటోగా తీసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు.. దీనికి పల్లవి ప్రశాంత్ అభిమానులే బాధ్యులని గుర్తించి రైతుబిడ్డపై ఆరు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 147, 148, 290, 353, 427, 149 సెక్షన్ల కింద పల్లవి ప్రశాంత్‌పై జూబ్లీహిల్స్ పోలీసులు కేసులు పెట్టారు. అంతేకాకుండా, కొంతమంది అభిమానులపై కేసులు నమోదు చేశారు.
ఇక పల్లవి ప్రశాంత్ ప్రస్తుతం అజ్ఙాతంలో ఉన్నట్టు కూడా ప్రచారం నడిచింది. దానిపై ఆయన స్పందిస్తూ నేను ఎక్కడికి పారిపోలేదు. నా ఇంట్లోనే ఉన్నాను. తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఎవరు నమ్మోద్దని అన్నాడు. ఇక పల్లవి ప్రశాంత్ ప్రవర్తనపై కొందరు ఫైర్ అవుతున్నారు. కేవలం నువ్వు గెలిచింది బిగ్ బాస్ టైటిల్.. అంతే కానీ ఆస్కార్ కాదు అంటూ ఫైర్ అవుతున్నారు. రైతుల పేరు చెప్పుకుని గెలిచి.. ఇలా రూడ్ గా బిహేవ్ చేయడం తప్పు అంటున్నారు మరికొంత మంది. అయితే పల్లవి ప్రశాంత్ అరెస్ట్ విషయంలో నాగార్జున కూడా స్పందిచినట్టు సమాచారం. అమర్ దీప్, ప్రశాంత్ ఫ్యాన్స్ గొడవ వలనే ఇంత జరిగింది. బయట రచ్చగా ఉన్న సమయంలో వారిని బయటకు పంపించకుండా ఉంటే బాగుండేది అని నాగార్జున అన్నాడట.
అంతేకాదు పోలీసులు కూడా దురుసుగా వ్యవహరించారని, వారు కొంత శాంతంగా ఉంటే బాగుండేదని చెప్పుకొచ్చారని సమాచారం. బిగ్ బాస్ 7 విజేతగా పల్లవి ప్రశాంత్ నిలుస్తాడని ముందుగానే వార్త బయటికి రావడంతో ఆయన అభిమానులు పెద్ద ఎత్తున కృష్ణానగర్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్ వద్దకు చేరుకున్నారు. ఆదివారం సాయంత్రానికే ప్రశాంత్ సొంతూరు నుంచి చాలా మంది స్నేహితులు, అభిమానులు అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గరికి వచ్చారు. అలాగే, అమర్ దీప్ అభిమానులు కూడా చేరుకున్నారు. ఇక ప్రశాంత్ అభిమానుల పేరిట కొంత మంది రోడ్డుపై హల్‌చల్ చేశారు. చీకటిపడిన తర్వాత నానా హంగామా సృష్టించారు. వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగించారు. ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేశారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…