Pacha Karpooram : దేవుడి పూజలో ఉపయోగించే కర్పూరం గురించి అందరికీ తెలిసిందే. అయితే ఇది తెల్లగా ఉంటుంది. కానీ పచ్చ కర్పూరం అని ఇంకొకటి ఉంటుంది. ఇది మనకు వ్యాధులను నయం చేసేందుకు ఉపయోగపడుతుంది. దీన్ని తినవచ్చు కూడా. పచ్చ కర్పూరంతో ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. దీన్ని రెండు పలుకులు తీసుకుని కొంచెం మంచి గంధాన్నిగానీ, వెన్నను గానీ కలిపి తమలపాకులో పెట్టి నమిలి రసాన్ని మింగితే వెంటనే వేడి తగ్గుతుంది. కళ్ళుబైర్లు కమ్మడం, తలతిరుగుడు, కడుపులో వికారం, అతిగా శరీరానికి చెమటలు పట్టడం తగ్గిపోతాయి.
బాగా పైత్యం చేసినవారు పచ్చ కర్పూరాన్ని తీసుకుంటుంటే పైత్య వికారాలన్నీ తగ్గిపోతాయి. కంటికి సంబంధించిన వ్యాధులతో బాధపడేవారు పచ్చకర్పూరాన్ని తీసుకుంటుంటే కళ్ళమంటలు, కళ్ళు ఎరుపెక్కడం, కళ్ళ వెంట నీరు కారడం, తలనొప్పి వంటివి తగ్గుతాయి. బీపీ ఉన్నవారు రెండుపూటలా పచ్చకర్పూరాన్ని తీసుకుంటే బీపీ పెరగకుండా అరికడుతుంది. మూత్రం పోసేటపుడు మంట, చీము, సుఖ వ్యాధులున్నవారు పచ్చకర్పూరాన్ని గంధంతో కలిపి తీసుకుంటుంటే బాధలన్నీ నివారిస్తాయి. వేడి చేయడం వలన కలిగే ఒళ్ళు మంటలు, అరికాళ్లు, అరిచేతుల మంటలు మొదలైన వాటికి పచ్చ కర్పూరాన్ని గ్లాసుడు పాలతో కలిపి తీసుకుంటే వెంటనే ఉపశమనం కలుగుతుంది.
పచ్చకర్పూరం అయిదు గ్రాములు, జాజికాయ అయిదు గ్రాములు, జాపత్రి అయిదు గ్రాములు ఈ మూడింటిని మొత్తగానూరి.. దాంట్లో అయిదు గ్రాములు ఎండు ద్రాక్ష వేసి మళ్ళీ నూరి.. దీన్ని శనగ గింజలంత మాత్రలుగా తయారుచేసి పెట్టుకుని రోజూ పడుకోబోయే ముందు ఒక మాత్ర వేసుకుని.. పాలు తాగుతుంటే వీర్యం వృద్ధి చెందుతుంది. లైంగిక శక్తి బాగా పెరుగుతుంది. పచ్చకర్పూరాన్ని రోజూ మూడు పూటలా ఒకటి, రెండు పలుకులు తీసుకుంటుంటే బలం, రక్తపుష్టి కలుగుతాయి. లైంగిక శక్తి పెరుగుతుంది. బీపీ తగ్గుతుంది. కంటి జబ్బులు, రక్తస్రావాలు తగ్గుతాయి. ఏ మందు వాడుతున్నపుడైనా ఆ మందుతోపాటు ఒక పలుకు పచ్చ కర్పూరం కలిపి తీసుకుంటే ఔషధగుణం పెరుగుతుంది. ఇలా పచ్చ కర్పూరంతో ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…