Sr NTR : తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన నటుడిగా రాజకీయ నాయకుడిగా ఓవెలుగు వెలిగారు నందమూరి తారకరామారావు. ముఖ్యంగా తెలుగు ప్రజలందరికీ రాముడిగా మారిపోయారు ఆయన. ఎందుకంటే అప్పుడు వరకు రాముడిని కేవలం ఫోటోలలో చూడటం తప్ప డైరెక్ట్ గా చూసింది లేదు. కానీ రాముడి పాత్రలో నటించినా నందమూరి తారక రామారావు తెలుగు ప్రేక్షకులందరికీ రాముడు గా వారి గుండెలలో నిలిచిపోయాడు. రాజకీయాల్లోకి వెళ్లే ఏకంగా తక్కువ సమయంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని కూడా అధిరోహించి సరికొత్త చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే.
ఎన్టీ రామారావు గారు తెలుగు, తమిళ, హిందీ భాషలలో కలిపి దాదాపు 400 చిత్రాల్లో నటించారు. పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో అద్భుతమైన పాత్రలెన్నో పోషించి మెప్పించిన ఆయన రాజకీయాలలో కూడా తనదైన ముద్ర వేసుకున్నారు. తెలంగాణలో బడుగు బలహీన వర్గాలని పట్టి పీడిస్తున్న పటేల్ పట్వారి వ్యవస్థలని రద్దు చేసి తెలంగాణాలోని బడుగు బలహీన వర్గాలకు అన్నగారు ఆరాధ్య దైవంగా మారారు. అయితే సీనియర్ ఎన్టీఆర్ కు ప్రతి రోజూ ఉదయం లేవగానే చుట్ట తాగే అలవాటు ఉంది అన్న విషయం తెలిసిందే.
అయితే సీనియర్ ఎన్టీఆర్ కు చుట్ట తాగడం నేర్పించింది ఒక విలన్ అన్న విషయం మాత్రం ఎవరికీ తెలియదు. బాలకృష్ణ ఈ విషయాన్ని ఓ సందర్భంలో రివీల్ చేశాడు. తెలుగు చిత్ర పరిశ్రమలో విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా తన కంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న ముక్కామల కృష్ణమూర్తి అన్నగారికి చుట్ట తాగడం నేర్పించారట. అయితే కాలేజీ రోజుల నుంచే ముక్కామల కృష్ణమూర్తి ఎన్టీఆర్ మధ్య ఎంతో మంచి స్నేహ బంధం ఉండడంతో, కాలేజీ సమయంలో ఎన్నో నాటకాల్లో కూడా ఇద్దరూ కలిసి నటించే వారట. సినిమాల్లోకి వచ్చిన తర్వాత స్నేహ బంధాన్ని కొనసాగించడం జరిగింది. అలా ముక్కామల కృష్ణమూర్తి న్టీఆర్ కు కూడా చుట్ట తాగడం నేర్పించారట. ఎన్టీరామారావు కు ఉన్న విధంగానే తనకు సైతం చుట్టతాగే అలవాటు ఉండేదని బాలకృష్ణ వెల్లడించారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…