Amigos Movie : క‌ల్యాణ్ రామ్ అమిగోస్ మూవీ ఓటీటీలో.. ఎందులో అంటే..?

Amigos Movie : నంద‌మూరి హీరోల‌లో ఒక‌రైన క‌ళ్యాణ్ రామ్ హిట్, ఫ్లాప్స్‌తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నాడు. ‘బింబిసార’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత ఆయన త్రిపాత్రిభిన‌యంలో న‌టించిన చిత్రం ‘అమిగోస్’ . రాజేంద్ర రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై న‌వీన్ ఎర్నేని, వై.ర‌విశంక‌ర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఫిబ్ర‌వ‌రి 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరైన విజయాన్ని అందుకోలేదు. ప్రేక్ష‌కుల‌కి నిరాశ‌ప‌రచింది. సినిమా విడుదలకు ముందు వచ్చిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేసినప్పటికీ.. సినిమా మాత్రం ప్రేక్షకులను మెప్పింలేద‌నే చెప్పాలి.

అమిగోస్ చిత్రం కాన్సెప్ట్ కొత్తగా ఉన్నా ఎగ్జిక్యూషన్ బాలేదంటూ కొంత మంది కామెంట్లు చేశారు. థియేటర్ రన్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతోంది. ‘అమిగోస్’ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ ఇండియా కొనుగోలు చేయ‌గా, ఏప్రిల్ 1వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్ ఇండియాలో ‘అమిగోస్’ స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్‌ చేయనున్నట్టు నెట్‌ఫ్లిక్స్ వెల్లడించింది. కాబట్టి, థియేటర్లలో ఈ సినిమాను చూడలేకపోయిన ప్రేక్షకులు మరికొద్ది రోజుల్లో ఇంట్లోనే కూర్చొని చూసేయొచ్చు.

Amigos Movie to stream on ott
Amigos Movie

‘అమిగోస్’ చిత్రం ద్వారా రాజేందర్ రెడ్డి దర్శకుడిగా పరిచయం కాగా, కన్నడ బ్యూటీ అషికా రంగనాథ్ ఈ సినిమా ద్వారా టాలీవుడ్‌‌లోకి అడుగుపెట్టారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ ఈ సినిమాను నిర్మించారు. చిత్ర నిర్మాణ సంస్థ అయితే ‘అమిగోస్’ బ్లాక్ బస్టర్ మూవీ అని ప్రకటించిన క‌లెక్ష‌న్స్ మాత్రం అంత‌గా రాలేదు. జూనియర్ ఎన్టీఆర్ సైతం సినిమా చూసి అద్భుతంగా ఉందని చెప్పారన్నారు. దీంతో నందమూరి అభిమానులు ‘అమిగోస్’పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. కాని మూవీ మాత్రం ప్రేక్ష‌కుల‌ని పెద్ద‌గా అల‌రించ‌లేక‌పోయింది.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

4 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

4 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago