Aditi Rao Hydari : సిద్ధార్థ్‌తో ప్రేమ వ్య‌వ‌హారం.. క్లారిటీ ఇచ్చిన అదితి రావు..

Aditi Rao Hydari : హీరో సిద్ధార్థ్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. బాయ్స్, బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి విజయవంతమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఇత‌ను కొంత కాలంగా టాలీవుడ్‌కి దూరంగా ఉన్నాడు. మ‌హాస‌ముద్రం సినిమాతో ఇటీవ‌ల ప‌ల‌క‌రించాడు. అయితే కొంత కాలంగా అత‌ను హైదరబాదీ బ్యూటీ అదితి రావు హైదరి తో డేటింగ్‌లో ఉన్నాడు. వీరిద్దరూ కలిసి మహా సముద్రం లో నటించిన సంగతి తెలిసిందే. అప్పుడు ఇద్దరి మధ్య ప్రేమ పుట్టిందని, లివ్ ఇన్ రిలేషన్‌లో ఉన్నారంటూ వార్తలు వచ్చాయి. ఇటీవ‌ల శర్వానంద్‌ ఎంగేజ్‌మెంట్‌ వేడుకలో ఇద్దరు క‌లిసి పాల్గొన్నారు.

తాజాగా ఇద్దరు కలిసి ఓ తమిళ పాటకి రీల్ చేశారు. దాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది అదితి రావు హైదరీ. ఇంతకంటే క్లారిటీ ఏం కావాలని నెటిజన్లు ఫిక్స్ అయిపోయారు. సిద్ధార్థ్‌, అదితి బహిరంగంగానే ప్రేమించుకుంటున్నారని, ఇదే సాక్ష్యం అంటూ రచ్చ చేస్తున్నారు. ఈ క్ర‌మంలో అదితి రావు హైదరీ స్పందించింది. ఓ మీడియాతో ఆమె ముచ్చటిస్తున్న క్రమంలో సిద్ధార్థ్‌తో లవ్‌ ఎఫైర్‌కి సంబంధించిన ప్రశ్న ఎదురు కాగా, దానికి షాకింగ్‌ ఆన్సర్‌ ఇచ్చింది అదితి. ఇందులో ఆమె పేర్కొంటూ తన వ్యక్తిగత విషయాలపై ఎందుకంత ఆసక్తి అంటూ ప్రశ్నించింది. పర్సనల్‌ విషయాలు కాదు, సినిమా కెరీర్‌పై దృష్టి పెట్టండి అని తెలిపింది.

Aditi Rao Hydari finally told about siddharth
Aditi Rao Hydari

తాను ఎవరితో రిలేషన్‌లో ఉన్నాననే దానిపై కాకుండా తన సినిమాల గురించి మాట్లాడితే బాగుంటుందని ఆమె చెప్పుకొచ్చింది. ప్ర‌స్తుతం త‌న దృష్టంతా సినిమాల‌పైనే ఉంద‌ని పేర్కొంది.మంచి దర్శకులతో పనిచేయడం ఇష్టమని, కెరీర్‌ పై దృష్టి పెడుతున్నానని చెప్పింది. ఆడియెన్స్‌ తనని ఆదరించి తన సినిమాలు చూసేంత వరకు తాను సినిమాలు చేస్తానని వెల్లడించింది. కానీ సిద్ధార్థ్‌తో ప్రేమలో ఉన్నారా? లేరా అనేది మాత్రం ఆమె చెప్పలేదు. ఇద్ద‌రు త‌మ ప్రేమ గురించి హింట్ ఇస్తున్నా కూడా ఎందుకో అఫీషియ‌ల్‌గా చెప్ప‌డం లేదు.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

3 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

3 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

3 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

3 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

3 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

3 months ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

3 months ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

3 months ago