Organic Mama Hybrid Alludu : ఓటీటీలోకి వ‌చ్చేసిన ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు.. సినిమా ఎలా ఉంది అంటే..!

Organic Mama Hybrid Alludu : ప్రముఖ సినీ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు’. ఈ సినిమాలో బిగ్ బాస్ ఫేమ్ సోహెల్, మృణాళిని రవి హీరో హీరోయిన్లుగా నటించారు. గత నెలలో వెండితెర‌పై సంద‌డి చేసిన ఈ మూవీ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులోకి వచ్చింది. మామ- అల్లుడు అనే కాన్సెప్ట్ తో తీసిన ఆ సినిమా పేరు ‘ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు’ అనే టైటిల్ ఫిక్స్ చేయ‌గా, ఈ సినిమా క‌థ ఏంటి, మూవీ ఎలా ఉందో చూద్దాం.

క‌థ‌లోకి వెళితే విజయ్ (సోహెల్ సయ్యద్ ర్యాన్) రెండు డిజాస్టర్ సినిమాలు తీసిన డైరెక్టర్. మధ్య తరగతి కుటుంబం (హేమ, సూర్య) కుమారుడైన విజయ్.. బిజినెస్ మ్యాన్ వెంకట రమణ (రాజేంద్ర ప్రసాద్, మీనా) దంపతుల కుమార్తె (హాసిని)తో తొలిచూపులోనే ల‌వ్‌లో ప‌డ‌తాడు. డబ్బు, సంస్కారానికి ప్రాధాన్యం ఇచ్చే వెంకటరమణ తన కూతురు ప్రేమను నిరాకరిస్తాడు. ఈ క్రమంలో విజయ్‌కి నిర్మాత ముణికొండ అనకొండ ( సునీల్) మూడో సినిమా అవకాశం ఇస్తాడు. అయితే రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యాక విజ‌య్ ఏం చేశాడు.. మూడో సినిమా అవకాశం వచ్చిన తర్వాత హిట్ కొట్టాడా? తన ప్రేమను గెలిపించుకోవడానికి విజయ్ ఏం చేశాడు అనేది చిత్ర క‌థ‌.

Organic Mama Hybrid Alludu movie now streaming on ott
Organic Mama Hybrid Alludu

చిత్రంలో సొహైల్ ఎనర్జిటిక్ గా చేసుకుంటూ వెళ్లిపోయాడు. హీరోయిన్ గా చేసిన మృణాళిని రవి.. జస్ట్ నవ్వుతో సీన్లనీ లాక్కొచ్చేసింది. ఇందులో రాజేంద్ర ప్రసాద్, మీనా, హేమ, అలీ, సునీల్, సప్తగిరి, వరుణ్ సందేష్, రష్మీ.. ఇలా చాలామంది ప్రముఖ నటీనటులు ఉండ‌గా వారు త‌మ పాత్ర‌ల‌కి కొంత న్యాయం చేశారు. డైరెక్టర్ SV కృష్ణారెడ్డి.. ఇప్పటి జనరేషన్, ట్రెండ్ ని అర్థం చేసుకోలేక మమ అనిపించేశారు. హీరోయిన్‌కు పెళ్లి చూపులు ఎపిసోడ్స్‌ను సుదీర్ఘంగా సాగదీయడం.. ఛాన్స్ దొరికితే డైలాగ్స్‌తో క్లాసులు పీకడం అతిగా అనిపిస్తుంది. అమలాపురం ఎపిసోడ్ సహనానికి పరీక్షలాగా ఉంటుంది.థియేట‌ర్‌లో పెద్ద‌గా ఆడ‌ని ఈ సినిమాని టైమ్ పాస్ కోసం అయితే చూడొచ్చు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago