Aishwarya Rai : దిగ్గజ దర్శకుడు మణిరత్నం రూపొందించిన చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్ 2’. పొన్నియన్ సెల్వన్ చిత్రం హిట్ కావడంతో ఈ సినిమాకి సీక్వెల్‌గా రూపొందిన ఈ చిత్రం నాలుగు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఈ క్రమంలో నిన్న హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఐశ్వర్య రాయ్, జయం రవి, కార్తి, త్రిష తదితర తారలు హాజరయ్యారు. అయితే ఈ ఈవెంట్ లో ఐశ్వరర్యరాయ్ చాలా ఎమోషనల్‌గా మాట్లాడింది. సుమ ముందుగా ఐశ్వర్యరాయ్ ని దగ్గరగా చూసి చాలా ఖుష్ అయింది. ఆ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న సమయంలో స్వీట్ హగ్ కూడా ఇచ్చింది.
అనంతరం స్పీచ్‌లో చిత్ర యూనిట్‌లో ప్రతి ఒక్కరిని అభినందించింది. ఏ పాత్ర మీకు బాగా నచ్చుతుంది అంటే అది పిక్ చేసుకోవడం కష్టమని తెలిపింది. ఇక అద్భుతమైన డ్యాన్స్ పర్‌ఫార్మెన్స్ ఇచ్చిన వారిని కూడా ప్రశంసించింది. ఇక ఏప్రిల్ 28న ఈ సినిమాని ప్రతి ఒక్కరు చూసి ఎంకరేజ్ చేయమని చెబుతూ తెలుగులో ధన్యవాదాలు తెలియజేసింది ఐశ్వర్యరాయ్. ఆమె స్టేజీ మీద ఉన్నంత సేపు ఆడిటోరియం మార్మోగిపోయింది. ఇక ఈ కార్యక్రమంలో మణిరత్నం మాట్లాడుతూ.. దర్శక ధీరుడు రాజమౌళికి కృతజ్ఞతలు తెలిపారు. బాహుబలి స్ఫూర్తితోనే ‘పొన్నియన్ సెల్వన్’ను తెరకెక్కించినట్లు తెలిపారు.
బాహుబలిని రెండు భాగాలుగా తీయకపోయుంటే.. పొన్నియన్ సెల్వన్ తీసేవాడిని కాదని అన్నారు. తన టీమ్ రాజమౌళికి కృతజ్ఞతలు తెలుపుతోందని అన్నారు. ‘‘నేను గతంలోనే ఈ విషయాన్ని చాలాసార్లు చెప్పాను. రాజమౌళికి కూడా చెప్పాను. మరోసారి చెబుతున్నా. బాహుబలి లేకపోతే పొన్నియన్ సెల్వన్ లేదు .. ఆయన వేసిన బాటలోనే మేమంతా వెళ్తున్నాం’’ అని మణిరత్నం ప్రశంసలు కురిపించారు. బాహుబలి.. చారిత్రాత్మక సినిమాలు చేసేందుకు కావాల్సిన నమ్మకాన్ని సినీ ఇండస్ట్రీకి ఇచ్చిందని మణిరత్నం ప్రశంసలు కురిపించారు. మొత్తానికి పొన్నియన్ సెల్వన్ 2 టీం నిన్న హైదరాబాద్‌లో తెగ సందడి చేసింది.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…