Balakrishna Wig : నటసింహం నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఆయన సినిమాలు చూస్తే ప్రేక్షకులకి పూనకాలు రావడం గ్యారెంటీ. ఇప్పటికీ వైవిధ్యమైన సినిమాలు చేస్తూ ప్రేక్షకులని అలరిస్తున్నాడు. చివరిగా వీరసింహారెడ్డి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాగా, ఈ సినిమా ఎంతగానో అలరించింది. అయితే బాలకృష్ణ విగ్గుకి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. తాజాగా నందమూరి బాలకృష్ణ మేకప్ వాసు కొప్పిశెట్టి ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ వాడే విగ్గు ధర ఎంత ఉంటుందనే విషయాన్ని ఆయన వెల్లడించారు.
నిజానికి నందమూరి బాలకృష్ణ తన సినిమాలకు విగ్గు వాడతారు అన్న విషయం దాదాపు అందరికీ తెలిసిందే. నిజానికి ఆయన ఎక్కువగా సినిమాల్లో డ్యూయల్ రోల్స్ లో కనిపిస్తూ మెప్పిస్తూ ఉంటారు.. కాబట్టి ఒక రోల్ ఒరిజినల్ గానే అనిపించినా రెండవ రోల్ కోసం కచ్చితంగా విగ్గు వాడాల్సి వస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలోనే వాసు కొప్పిశెట్టి మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణ సినిమాల కోసం ధరించే విగ్గులను ఒక్కోసారి ముంబై నుంచి తీసుకొస్తాము అంటూ వాసు కొప్పిశెట్టి చెప్పుకొచ్చాడు. ఒక్కోసారి హైదరాబాదులో తీసుకుంటాం.
ఇప్పుడు హైదరాబాద్ లోనే అదునాతనమైన విగ్గులు అందుబాటులోకి వచ్చేసాయి . అయితే బాలకృష్ణ వాడే విగ్గుల ధర లక్షల్లోనే ఉంటుందని.. తక్కువ రకం విగ్గులు ఆయన వాడరని వాసు చెప్పుకొచ్చారు. నందమూరి బాలకృష్ణ చాలా అందగాడని ఆయన అందానికి కాస్త మెరుగులు దిద్దే ప్రయత్నం చేస్తున్నాం తప్ప అందులో తన పనితనం ఏమీ లేదని ఈ సందర్భంగా వాసు చెప్పుకొచ్చారు. చివరిగా బాలయ్య వీరసింహారెడ్డితో పలకరించగా ఇప్పుడు అనీల్ రావిపూడితో ఓ సినిమా చేస్తున్నారు. ఈమూవీ హిట్ కొడితే.. బాలయ్య ఖాతాలో హ్యాట్రిక్ హిట్ పడినట్టే. అభిమానులు అయితే దాదాపు ఈ సినిమా హిట్ అనే ఫిక్స్ అవుతున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…