Balagam Soudhamini : ఇప్పుడు ఎక్కడ చూసిన కూడా బలగం మూవీ గురించే చర్చ నడుస్తుంది. ఈ సినిమా అనేక అంతర్జాతీయ అవార్డులు కూడా అందుకుంది. ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ జంటగా నటించగా.. మిగతా నటీనటులు అడియన్స్ కు అంతగా మనకు తెలియనివారే. కానీ ఈ సినిమాతో ప్రేక్షకుల మనసులలో చెరగని స్థానం సంపాదించుకున్నారు. ఈ మూవీలో కనిపించింది తక్కువ సమయమే అయినా.. తన నటనతో నవ్వించింది. ఎక్కువగా డైలాగ్స్ లేకుండానే జనాలని ఉట్టిగా ఆకర్షించింది సౌదామిని. ప్రియదర్శి పెళ్లి చేసుకోబోయే అమ్మాయిగా కనిపించింది సౌదామిని.
కొమురయ్య చనిపోయినప్పుడు కాబోయే భర్త ఇంటికి రావడం.. అక్కడ ప్రియదర్శి.. సౌదామిని మధ్య ఎలాంటి డైలాగ్స్ లేకుండానే.. కేవలం ఎక్స్‌ప్రెషన్స్‌తో వారిద్దరు ప్రేక్షకులు తెగ నవ్వు తెప్పించారు. వారిద్దరి మధ్య ఒక్క డైలాగ్ లేకపోయినా.. తన ఎక్స్‌ప్రెషన్స్‌తోనే ఫేమస్ అయ్యింది. ఆర్టిస్ట్ కావాలనే కోరికతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సౌదామిని.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఈ సినిమా కోసం తాను ఏకంగా పది కేజీల బరువు పెరిగినట్లు చెప్పుకొచ్చింది. ‘ఆడిషన్ కోసం డైరెక్టర్ వేణు ఆఫీస్ కి వెళ్ళాను. ఆయన నన్ను సిగ్గుపడి చూపించమనగా, నేను నా పెర్ఫార్మన్స్ చేసి చూపించగా ఓకే చేశారు.
నాకు చిన్నప్పటి నుండి నటి కావాలనే ఆశ ఎంతో ఉండేది.ఉంది. ఈ పాత్ర కోసం పది కేజీల బరువు పెరగమంటే… కేకులు తిని లావయ్యాను. హీరో ప్రియదర్శి మంచి సపోర్ట్ ఇచ్చారు. వేణు కారణంగానే నాకు గుర్తింపు వచ్చింది.సినిమా ఆఫర్స్ కోసం ఒంటరిగా ఎక్కడికెళ్లాలన్నా భయం ఉండేది. అందుకే అన్నయ్యను తోడు తీసుకుపోయేదాన్ని. బలగం చిత్రం చూశాక జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ కాల్ చేశారు. ఆయన మూవీలో నాకు ఛాన్స్ ఇస్తానన్నారు. ఒకప్పుడు నీ ముఖానికి హీరోయిన్ అవుతావా? అని ఎగతాళి చేశారు అంటూ సౌదామిని చెప్పుకొచ్చింది. బలగం విషయానికి వస్తే.. ఎన్నో కుటుంబాలను ఈ సినిమా మళ్లీ కలిపిందని చెప్పవచ్చు.కొన్ని ఏళ్ల నుంచి పగలు ప్రతీకారాలతో కోపంతో రగిలిపోతున్న ఫ్యామిలీలు కూడా ఈ సినిమాను చూసిన తర్వాత ఒక్కటయ్యాయి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…