నందమూరి బాలకృష్ణకి వివాదాలు కొత్తేమి కాదు.తాజాగా వీరసింహా రెడ్డి సినిమా విజయోత్సవంలో నందమూరి బాలకృష్ణ మాటలు వివాదానికి కారణం అయ్యాయి. ఆ సమావేశంలో సుమారు అరగంట సేపు మాట్లాడిన నందమూరి బాలకృష్ణ, చివర్లో ఒక్కొక్కరి గురించి చెబుతూ తన నిర్మాతలను చేయి పట్టుకుని ముందుకు లాగి మాట్లాడారు. ఆ క్రమంలో ‘‘ఈయన ఉన్నాడంటే ఎప్పుడూ కూర్చుని శాస్త్రాలు.. నాన్న గారు.. డైలాగులు.. ఆ రంగా రావు.. ఈ అక్కినేని తొక్కినేని.. అన్నీ కూడా మాట్లాడుకుంటూ ఉండేవాళ్లం..’’ అని అన్నారు బాలకృష్ణ. దీంతో ఎస్వీ రంగా రావు, అక్కినేని నాగేశ్వర రావులను బాలకృష్ణ అవమానించారంటూ సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు కనిపించాయి.
బాలయ్య కోపిస్టీ అనే సంగతి చాలా మందికి తెలుసు. ఆయన ఎంత కోపం ఉన్నా.. మనసు మాత్రం వెన్న అంటారు మరికొంత మంది. ఎవరు ఎన్ని అన్నా.. బాలయ్య ఎక్కువ వివాదం అయ్యింది మాత్రం ఆయన నోరు జారడం వల్లే. ఓ సందర్భంలో దేవ బ్రహ్మణులకు.. రావణ బ్రహ్మకు లింక్ పెడుతూ.. బాలయ్య చేసిన వాఖ్యలు దుమారం రేపాయి. దాంతో ఆయన అఫీషియల్ గా వారికి క్షమాపణలు చెపుతూ.. ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. అప్పుడేదో క్షమాపణలు చెప్పారు కాని.. ఆయన అలా చెప్పడం అనేది చాలా అరుదు. గతంలో ఇలాంటి వివాదాల్లో.. ఇలాంటి మాటలెన్నో అన్నారు బాలకృష్ణ. ఇండస్ట్రీ అంతా కరోనా టైమ్ లో.. టికెట్ రేట్ల గురించి.. ఇండస్ట్రీ కష్టాల గురించి సీఎంలను కలిసినప్పుడు.. బాలయ్యను ఆహ్వానించకపోవడం ఎంతో వివాదం అయింది.
ఆ సమయంలో వాళ్లు భూముల గురించి మాట్లాడుకోవడానికి వెళ్లినట్టున్నారు అని బాలయ్య అనడం చాలా పెద్ద వివాదానికి దారి తీసింది. కాని ఈ విషయంలో చాలా స్టాండెడ్ గా నిలబడ్డాడు మాస్ హీరో. ఓ ఆడియో ఫంక్షన్ లో స్టేజ్ మీదనే ఆయన అమ్మాయికి ముద్దు అయినా పెట్టాలి..కడుపు అయినా చేయాలి…అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు అప్పట్లో వివాదస్పదమైన విషయం తెలిసిందే. ఆతర్వాత ఈ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం కూడా రేగిది. చాలా మంది వాటిపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో బాలయ్య మహిళలకు క్షమాపణలు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఏదేమైన ఇలా నోరు జారడంతో వివాదాలలో ఇరుక్కోవలసి వస్తుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…