వీరసింహారెడ్డి సక్సెస్ మీట్‌లో బాలకృష్ణ కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అక్కినేని తొక్కినేని అంటూ నందమూరి బాలకృష్ణ మాట్లాడిన తీరుపై ఎ.ఎన్.ఆర్ ఫ్యాన్స్ రియాక్ట్ అయ్యారు. అలానే దీనిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగింది. బాలయ్య తప్పుగా మాట్లాడరని, ఆయన సారీ చెప్పాలంటూ పలువురు ఫ్యాన్స్ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అక్కినేని నాగ చైతన్య ,అఖిల్ కూడా ఈ విషయంపై కాస్త ఘాటుగానే స్పందించారు. అయితే ఈ వివాదంపై బాలయ్య ఏమైన స్పందిస్తారా అని అందరు ఎదురు చూస్తున్న సమయంలో ఎట్టకేలకు స్పందించారు.
హిందూపురంలోని జరిగిన అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న బాలకృష్ణ.. ‘‘నాపై జరిగే ట్రోలింగ్‌ను నేను పట్టించుకోను. నా గురించి అంతా తెలుసు. అవకాశంగా తీసుకుని ట్రోల్ చేస్తున్నారు. కానీ.. నేనెంటో ప్రజలకు తెలుసు. రామారావుగారిని ఎన్టీవోడు అని అంటారా లేదా.. అలాగే నాగేశ్వరరావుగారిని నాగయ్యగారు అని అంటారు. రాష్ట్రంలో ఒక్కొక్క యాస, అభిమానంతో పిలుస్తుంటారు. నేను కూడా ప్రచారానికి వెళ్లినప్పుడు నన్ను చూసి ఏదో ఒక పేరుతో వెళ్లిపోతున్నాడురా అని అంటారు. కూలీ పని చేసుకునేవాళ్లు… వాళ్లు వీళ్లు అభిమానంతో పిలుచుకుంటారు.
మనకు ఆప్తులైన వారిని మనం అలాగే పిలుచుకుంటాం. ఉదాహరణకు తాడో పేడో అంటాం. అందులో పేడోకి అర్థమేంది. ఏదేమైనా నాగేశ్వరరావుగారు నాకు బాబాయే. నేనంటే ఆయనకు చాలా ఇష్టం. సొంత పిల్లల కంటే నన్ను ఎక్కువ ప్రేమగా చూసుకునేవారు. ఆప్యాయంగా పలకరించేవారు. మా మధ్య అంత ఆప్యాయత ఉంది. ఇండస్ట్రీకి రెండు కళ్లు ఎన్టీఆర్, ఏఎన్ఆర్. నాన్నగారి నుంచి క్రమశిక్షణ నేర్చుకుంటే..బాబాయ్ నుంచి పొగడ్తలకు దూరంగా ఉండటాన్ని నేర్చుకున్నాను. నాన్నగారి పేరుతో ఏర్పాటు చేసిన జాతీయ అవార్డును ముందుగా నాగేశ్వరరావుగారికే ఇచ్చాం’’ అని చెప్పుకొచ్చారు బాలయ్య. . బాబాయ్‌పై ప్రేమ గుండెల్లో ఉంటుందని.. బయట ఏం జరిగినా నేను పట్టించుకోనవసరం లేదని అన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…