లలిత జ్యువెలర్స్ ఎండీ కిరణ్ కుమార్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. టీవీల్లో తన కంపెనీకి సంబంధించి ప్రచారాలని వినూత్నంగా చేసుకుంటూ అందరి దృష్టిని ఆకర్షించాడు కిరణ్.ఎన్నో కంపెనీలకు మరియు ప్రొడక్ట్స్‌కు సంబంధించిన వాణిజ్య ప్రకటనలు మనం చూస్తూ ఉంటాం.అయితే లలిత జ్యూవెలరీ యాడ్ మాత్రం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఎవరు మోడల్స్ ఉండరు, అందాల ముద్దుగుమ్మలు ఆ యాడ్స్‌లో కనిపించరు, లలిత జ్యూవెలర్స్ కంపెనీకి తానే ఒక పెద్ద బ్రాండ్ అంబాసిడర్ గా మారిన కిరణ్ కుమార్ అందరి దృష్టిని ఆకర్షించాడు. నా కంపెనీకి నేనే అంబాసిడర్‌గా వ్యవహరిస్తాని మొదలు పెట్టిన ఆయన అనూహ్యంగా గుర్తింపు దక్కించుకున్నాడు.
ఎక్కువ శాతం మంది ఆయన మాట తీరును చూసి తెలుగు వ్యక్తి కాదని అనుకుంటారు..కాని ఆయన పక్కా తెలుగు వ్యక్తి.నెల్లూరు జిల్లాకు చెందిన వ్యక్తి, అయితే తమిళనాడుకు కాస్త దగ్గరగా ఉండటం వల్ల భాష మరియు యాసలో కాస్త తేడాగా ఉంటుంది.కిరణ్ కుమార్ నెల్లూరులో బంగారపు వస్తువులు తయారు చేసే వర్క్ షాపులో నెల సరి జీతానికి పని చేసేవాడు. వ్యాపారవేత్తగా ఎంతో సక్సెస్ అయి కోట్లాది ఆస్తులకు అధిపతి అయ్యారు. అయితే తాను ఇంత సక్సెస్ కావడానికి కారణం మహానటి సావిత్రి అని ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
చెన్నైలో మహానటి సావిత్రి ఇంటిని కొనుగోలు చేసి అక్కడే వ్యాపారాన్ని విస్తరించానని అన్నాడు కిరణ్ కుమార్. సావిత్రి పిల్లలు ఆమె పేరు మీద ఒక కమర్షియల్ బిల్డింగ్ కట్టారని, దాన్ని రెంటుకు తీసుకొని బంగారం షాప్ మొదలు పెట్టానని, సావిత్రి ఆశీర్వాదం వల్లే నా వ్యాపారం బాగా నడిచిందని ఇంత పెద్ద సక్సెస్ అయ్యానని కిరణ్ కుమార్ పేర్కొన్నారు. అందుకే ఇప్పటికీ ఆమె పేరు మీదే బిల్డింగ్ ఉందని తెలియజేశారు. అది కేవలం లలిత కార్పొరేట్ ఆఫీస్ అని మాత్రమే రాశాము కానీ సావిత్రి గణేష్ గారి పేరు మీదే ఉంచామని తెలియజేశాడు. ఓ సందర్భంలో సావిత్రి కూతురు చాముండేశ్వరి మాట్లాడుతూ.. అమ్మకు బంగారం అంటే చాలా ఇష్టం. కిరణ్ కుమార్ ది బంగారం షాపు. అమ్మకు కార్లు అంటే ఇష్టం. కిరణ్ కు కూడా చాలా ఇష్టం. ఈ విధంగా అభిప్రాయాలు కలవడంతో ఆయనకు అమ్మేశామని చెప్పుకొచ్చింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…