Nithya Ravindran : తెలుగుతో పాటు ఏ ఇండస్ట్రీలో చూసినా సిస్టర్ సెంటిమెంట్ తో వచ్చి బ్లాక్ బస్టర్ లుగా నిలిచిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. పాత్ర స్వభావం ఎలాంటిదైనా తెలుగు చిత్ర సీమలో సిస్టర్ సెంటిమెంట్ కు ఎప్పుడూ క్రేజ్ తగ్గలేదు. అయితే చెల్లి పాత్రల కోసమే పుట్టినట్లుగా కొందరు గుర్తుండిపోతారు. అలాంటి వారిలో ఒకరు సంయుక్త. ఇప్పటి వరకు తెలియకపోవచ్చు గానీ.. 1970, 80 దశకాల్లో పుట్టిన వారికి మాత్రం ఈమె సుపరిచుతురాలే. 80-90ల మధ్య సిస్టర్ రోల్ కి బ్రాండ్ అంబాసిడర్ గా సంయుక్త గుర్తింపు తెచ్చుకున్నారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన సంయుక్త.. తర్వాత హీరోయిన్‌కు ఫ్రెండ్ గా, హీరోలకు చెల్లిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, ఇప్పుడు సీరియల్ నటిగా సెటిలయ్యారు. మనందరికీ సంయుక్తగా బాగా గుర్తు ఉన్నప్పటికీ నిజానికి ఈమె పూర్తి పేరు నిత్య రవీంద్రన్.
తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో దాదాపు 50 సంవత్సరాలుగా నటిస్తూనే వున్నారు సంయుక్త అలియాస్ నిత్య రవీంద్రన్. ఈమె చెల్లిగా నటించింది మెగాస్టార్ చిరంజీవితోనే ఎక్కువ కావొచ్చు. ఖైదీ, న్యాయం, మీరే చెప్పాలి, స్వయంకృషి వంటి సినిమాల్లో చిరంజీవికి ఎంత పేరొచ్చిందో, ఆమెకు అంతే వచ్చింది. ఆ విధంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆడపడుచుగా అందరికీ గుర్తుండిపోయిన సంయుక్త ఉన్నట్టుండి తెలుగు సినిమా ఇండస్ట్రీకి దూరమైపోయింది. తర్వాత తమిళ్, మలయాళ ఇండస్ట్రీలో తల్లి పాత్రలో నటిస్తూ అలరిస్తోంది.
ప్రస్తుతం సోషల్ మీడియా పుణ్యమా అని ఇటీవల ఈమె ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలు కొన్ని వైరల్ గా మారాయి. ఈమె కుటుంబ నేపథ్యం చూస్తే భర్త పేరు రవీంద్రన్ ఇతను కూడా సినిమా ఇండస్ట్రీకి చెందిన వారే. ఈయన ప్రముఖ సినిమాటోగ్రాఫర్. తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పని చేసి మంచి గుర్తింపు సంపాదించారు. ఈమె పిల్లల విషయానికి వస్తే ఇద్దరు పిల్లలు. కొడుకు పేరు అర్జున్, కూతురు పేరు జనని. కొడుకు కూడా తమిళ్ సినిమా ఇండస్ట్రీలో రాణిస్తున్నాడు. కూతురు పై చదువులు చదివి యు.ఎస్ లో సెటిల్ అయింది. ప్రస్తుతం బుల్లితెరపై సంయుక్త బిజీగా ఉన్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…