Viral Video : జీవితం అందరికీ వడ్డించిన విస్తరి కాదు. కొందరు ఎంతో కష్టపడి ఇప్పుడు గొప్ప పొజిషన్ లో ఉంటారు. అలా ఎవరికైనా లైఫ్ లో ఏదో ఒక స్టార్ట్ ఉంటుంది. ఇప్పుడు మనకు పెద్ద పెద్ద పొజిషన్ లో కనిపిస్తున్న ఎంతోమంది ఒకప్పుడు ఏదో చిన్న పొజిషన్ నుంచి స్టార్ట్ చేసుంటారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా అంతే.. ఇప్పుడు ఉన్న స్టార్ హోరోయిన్స్ కూడా ఒకప్పుడు అలాగే చిన్నచిన్న రోల్స్ చేసి ఇప్పుడు అంత పెద్ద స్టార్స్ అయ్యారు. ఈ యాడ్ లో కనిపిస్తున్న స్టార్ హీరోయిన్ ని గుర్తు పెట్టారా..!? ఆమె ఎవరో కాదు సౌత్ స్టార్ హీరోయిన్ సమంత.
నాగచైతన్య హీరోగా చేసిన ఏ మాయ చేసావే చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది సమంత. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకొని వరుస ఆఫర్లతో తెలుగులో నెంబర్ వన్ హీరోయిన్ స్థానానికి ఎదిగింది. ఏ మాయ చేసావే చిత్రం నుంచి.. తాజాగా విడుదలైన యశోద చిత్రం వరకు.. దాదాపు దశాబ్దం పైన గడుస్తున్న సమంత క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. టాలీవుడ్ లో స్టార్ హీరోలందరి సరసన నటించిన సమంత, ప్రస్తుతం బాలీవుడ్ మరియు హాలీవుడ్ లో కూడా నటిస్తుంది.
అయితే సమంత సినిమాల్లోకి రాకముందు కొన్ని యాడ్ ఫిల్మ్స్ లో నటించిన విషయం మీకు తెలుసా? డిగ్రీ చదువుకునే సమయంలోనే చెన్నైలోని నాయుడు హాల్లో మోడలింగ్ గా పని చేసింది సమంత. ఈ క్రమంలో సమంతకి తమిళనాడు కి చెందిన ఆశిక టెక్స్ టైల్స్ కి సంబంధించిన ఉత్పత్తులను ప్రమోట్ చేస్తూ తీసిన యాడ్ లో నటించే అవకాశం వచ్చింది. పాకెట్ మనీ కోసం డబ్బులు వస్తాయనే ఉద్దేశంతో సమంత ఆ యాడ్ లో నటించింది. ఇందుకుగాను అప్పట్లో సమంతకి దాదాపు రూ. 5వేల పారితోషకం ఇచ్చారట. కాగా ప్రస్తుతం ఈ యాడ్ కి సంబంధించిన వీడియో యూట్యూబ్ లో వైరల్ గా మారింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…