Meena : సౌత్ లో అగ్ర హీరోలందరితోనూ ఆడి పాడిన అతి కొద్ది మంది హీరోయిన్స్‌లో మీనా ఒకరు. మీనా స్వతహాగా మలయాళ సినీ పరిశ్రమకు చెందినది అయినప్పటికీ టాలీవుడ్ లో కూడా హీరోయిన్ గా నటించి తనకంటూ ప్రత్యేక అభిమానులను సంపాదించుకుంది. ఈక్రమంలో మీనా నటించిన పలు లవ్, ఫ్యామిలీ ఓరియెంటెడ్ చిత్రాలు సినీ ప్రేక్షకులను కట్టి పడేసాయి. అయితే ఇటీవలే ఆమె భర్త విద్యా సాగర్ అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఇప్పుడిప్పుడు మీనా ఆ దుఃఖం నుంచి కోలుకుంటున్నారు. షూటింగ్స్‌లో పాల్గొంటున్నారు.
ఈ క్రమంలో మీనా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తొకటి నెట్టింట వైరల్ అయ్యింది. అదేంటంటే ఆమె రెండో పెళ్లి చేసుకోబోతున్నారంటూ!. మీనాకు రెండో పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదట. కానీ కుమార్తె నైనికాను దృష్టిలో పెట్టుకుని తల్లిదండ్రుల ఒత్తిడి మేరకు రెండో పెళ్లికి ఒప్పుకున్నారంటూ వార్తలు నెట్టింట హల్ చల్ చేశాయి. అయితే దీనిపై మీనా మండిపడ్డారు. డబ్బుల కోసం ఏమైనా రాస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండో పెళ్లి చేసుకోబోతుందంటూ వస్తున్న వార్తలపై మీనా సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
కొంచెమైనా బుద్ధి ఉందా.. డబ్బు కోసం ఏమైనా చేస్తారా.. మీకు ఎవరు చెప్పారు.. నేను రెండో పెళ్లి చేసుకోబోతున్నానని.. సోషల్ మీడియా రోజు రోజుకు దిగజారిపోతుంది. వాస్తవాలు తెలుసుకుని.. అప్పుడు వార్తలు రాయండి. దిగజారి ప్రవర్తించకండి. నా భర్త చనిపోయినప్పుడు కూడా ఇలానే తప్పుడు ప్రచారం చేశారు. అవి ఇంకా ఆగలేదు. ఇలాంటి తప్పుడు వార్తలు పుట్టించే వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకునేలా చేస్తాను అంటూ సీరియస్ అయ్యారు మీనా. తాజాగా మీనా స్పందన చూస్తే రెండో పెళ్లి వార్తలు వట్టి పుకార్లే అని అర్థం అవుతోంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…