నిజంగా హ్యాట్సాఫ్‌.. న‌డిరోడ్డుపై చీర విప్పి ఐదుగురి ప్రాణాల‌ను కాపాడింది..

క‌ళ్ల ముందు ఏదైన ప్ర‌మాదం జ‌రిగితే ప్రాణాల‌కి తెగించి కాపాడే వారు చాలా త‌క్కువ మంది ఉంటారు. అయితే అందులో మ‌హిళ‌లు ఇంకా త‌క్కువ‌. అయితే ఓ మహిళ త‌న ప్రాణాల‌కి తెగించి న‌డిరోడ్డుపై చీర విప్పి ఐదుగురు ప్రాణాల‌ని కాపాడింది. తన చీరతో ఐదుగురి ప్రాణాలకు కాపాడి అంద‌రి ప్ర‌శంస‌లు అందుకుంటుంది. బెంగళూరులో కురిసిన భారీ వర్షాల వల్ల కేఆర్‌ కూడలి సమీపంలో అండర్‌ పాస్‌ వరద నీటిలో కారు చిక్కుకోవడంతో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన భానురేఖ అనే టెకీ క‌న్నుమూసారు. అయితే ఆ స‌మ‌యంలో వరదలో చిక్కుకుంది ఆరుగురు కాగా, .. మృతి చెందింది మాత్రం ఒక్కరే. అయితే మిగిలిన ఐదుగురిని ప్రాణాపాయం నుంచి కాపాడింది బెంగళూరు రెస్క్వూ టీమ్ అయిన‌ప్పటికీ వారు వ‌చ్చేంత వ‌ర‌కు కొట్టుకుపోకుండా ఉంచింది మ‌హిళ‌నే.

కేఆర్‌ కూడలిలోని అండర్‌ పాస్‌ వద్ద ఏదో గొడవగా ఉందని అదే మార్గంలో వెళ్తున్న ఓ మహిళ (42) గుర్తించింది. వర్షం నీటితో నిండిపోయిన అండర్‌ పాస్‌లో మీడియా ప్రతినిధి ఒకరు ఈత కొడుతూ మునిగిన కారులో చిక్కుకున్న వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే వారిని రక్షించేందుకు తాడు అవసరం కావడంతో ఎవరైనా సహకరించాలని ఆ యువకుడు అడిగాడు. అయితే ఆ స‌మ‌యంలో అంద‌రు నిస్స‌హాయిలై చూస్తున్నారే త‌ప్ప ఎవ‌రు కూడా సాయం చేసే ప్ర‌య‌త్నం చేయ‌లేదు. అప్పుడు మ‌హిళ మాత్రం తన ఒంటిపై ఉన్న చీరను విప్పి ఓ కొంగును ఆ యువకుడికి అందించింది. మరో కొసను అండర్‌ పాస్‌కు ఉన్న ఇనుప చువ్వలకు కట్టింది.

netizen praise this woman for her courageous stunt

అయితే ఆ మహిళ చీర‌ని ఆస‌రాగా చేసుకొని నీటిలో ఉన్నవారు ఒక్కొక్కరుగా బయటకు వచ్చారు. ఆమె చూపిన తెగువకు అక్కడి వారంతా అభినందించారు. మరో మహిళ తన వద్ద ఉన్న దుపట్టాను ఆమెకు అందించగా.. మరో వ్యక్తి తన చొక్కాను విప్పి ఆ మహిళకు ఇచ్చాడు. ఆ క్షణంలో మహిళ అందించిన చీర ఐదుగురి ప్రాణాలను నిలిపింది. ఇక ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అందులో మహిళ తన చీరను ఏ విధంగా ఉపయోగించి కాపాడిందో స్పష్టంగా అర్ధమవుతుంది. ఒకవేళ ఆ సమయానికి మహిళ సాయం చేసి ఉండకుంటే ఐదుగురు ప్రాణాలు కూడా గాలిలో క‌లిసిపోయేవి.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago