SS Rajamouli : సినిమా ఇండస్ట్రీలో కొన్ని కాంబినేష్స్ సూపర్ డూపర్ హిట్ గా నిలుస్తాయి. మరి కొన్ని కాంబినేషన్స్ ట్రెండ్ సెట్ చేస్తే బాగుంటుందని, వారి కాంబినేషన్‌లో ఎలా అయిన ఒక మంచి సినిమా రావాలని అభిమానులు కోరుకుంటూ ఉంటారు. అయితే కోట్లాది మంది అభిమానులతో పాటుగా ప్రేక్షకులు కూడా కోరుకునే కాంబినేషన్స్ లో ఒకటి పవన్ కళ్యాణ్ – రాజమౌళి చిత్రం అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఒక సినిమా పడితే చూడాలని ట్రేడ్ వర్గాలు సైతం అనుకుంటున్నాయి.అయితే ఇటీవల పవన్‌తో సినిమా చేయకపోవడానికి కారణం ఏంటి, ఎప్పుడు చేస్తాడు, అసలు సినిమా చేసే ఛాన్స్ ఉందా లేదా అనే విషయాన్ని రాజమౌళి తెలియజేశాడు.
పంజా సినిమా షూటింగ్ సమయం లో వీళ్లిద్దరు కలిసి ఒక సినిమా చేయాలనుకున్నారు..పవన్ కళ్యాణ్ కూడా నేను సిద్ధం కథ సిద్ధం చెయ్యండి అని రాజమౌళి కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు కూడా. అయితే రాజమౌళి కి ఉన్న కమిట్మెంట్స్ మరియు పవన్ కళ్యాణ్ కి ఉన్న పొలిటికల్ మీటింగ్స్ కారణంగా వీళ్లిద్దరి కాంబినేషన్ సెట్ అవ్వలేదు.. ఇప్పుడు రాజమౌళి ఏళ్ల తరబడి సినిమాలు చేస్తుండడం,పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీగా ఉండడం వలన చాల తక్కువ రోజులు డేట్స్ ఇవ్వడం జరుగుతూ వస్తుంది. అయితే ఎక్కడో ఒక మూల వీళ్లిద్దరి కాంబినేషన్ మూవీ వస్తుంది అనే నమ్మకం అభిమానుల్లో ఉండేది.
2024 తర్వాత ఈ క్రేజీ కాంబినేషన్ ఉండబోతుందని అంటున్నారు. అది కనుక జరిగితే సంచలనం క్రియేట్ చేయడం ఖాయం. కాని దాదాపు అసాధ్యమే. పవన్ అంటే తనకు ప్రేమ ఉందని, ఆయనపై రెస్పెక్ట్ ఉందని చెప్పిన రాజమౌళి ఆయనతో అవకాశం ఉంటే మాత్రం తప్పక చేసేలా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు తో ఒక సినిమా చెయ్యబోతున్నాడు..ఈ సినిమా కి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ లో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు..వచ్చే ఏడాది జూన్ నుండి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ పట్టాలెక్కనుంది.. ఇక పవన్ కళ్యాణ్ చేతిలో ‘హరిహర వీరమల్లు’ అనే సినిమాతో పాటు ‘భవదీయుడు భగత్ సింగ్’ , సుజిత్ తో ఒక మూవీ మరియు సురేందర్ రెడ్డి తో ఒక మూవీ ఉంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…