కళ్ల ముందు ఏదైన ప్రమాదం జరిగితే ప్రాణాలకి తెగించి కాపాడే వారు చాలా తక్కువ మంది ఉంటారు. అయితే అందులో మహిళలు ఇంకా తక్కువ. అయితే ఓ మహిళ తన ప్రాణాలకి తెగించి నడిరోడ్డుపై చీర విప్పి ఐదుగురు ప్రాణాలని కాపాడింది. తన చీరతో ఐదుగురి ప్రాణాలకు కాపాడి అందరి ప్రశంసలు అందుకుంటుంది. బెంగళూరులో కురిసిన భారీ వర్షాల వల్ల కేఆర్ కూడలి సమీపంలో అండర్ పాస్ వరద నీటిలో కారు చిక్కుకోవడంతో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన భానురేఖ అనే టెకీ కన్నుమూసారు. అయితే ఆ సమయంలో వరదలో చిక్కుకుంది ఆరుగురు కాగా, .. మృతి చెందింది మాత్రం ఒక్కరే. అయితే మిగిలిన ఐదుగురిని ప్రాణాపాయం నుంచి కాపాడింది బెంగళూరు రెస్క్వూ టీమ్ అయినప్పటికీ వారు వచ్చేంత వరకు కొట్టుకుపోకుండా ఉంచింది మహిళనే.
కేఆర్ కూడలిలోని అండర్ పాస్ వద్ద ఏదో గొడవగా ఉందని అదే మార్గంలో వెళ్తున్న ఓ మహిళ (42) గుర్తించింది. వర్షం నీటితో నిండిపోయిన అండర్ పాస్‌లో మీడియా ప్రతినిధి ఒకరు ఈత కొడుతూ మునిగిన కారులో చిక్కుకున్న వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే వారిని రక్షించేందుకు తాడు అవసరం కావడంతో ఎవరైనా సహకరించాలని ఆ యువకుడు అడిగాడు. అయితే ఆ సమయంలో అందరు నిస్సహాయిలై చూస్తున్నారే తప్ప ఎవరు కూడా సాయం చేసే ప్రయత్నం చేయలేదు. అప్పుడు మహిళ మాత్రం తన ఒంటిపై ఉన్న చీరను విప్పి ఓ కొంగును ఆ యువకుడికి అందించింది. మరో కొసను అండర్ పాస్‌కు ఉన్న ఇనుప చువ్వలకు కట్టింది.
అయితే ఆ మహిళ చీరని ఆసరాగా చేసుకొని నీటిలో ఉన్నవారు ఒక్కొక్కరుగా బయటకు వచ్చారు. ఆమె చూపిన తెగువకు అక్కడి వారంతా అభినందించారు. మరో మహిళ తన వద్ద ఉన్న దుపట్టాను ఆమెకు అందించగా.. మరో వ్యక్తి తన చొక్కాను విప్పి ఆ మహిళకు ఇచ్చాడు. ఆ క్షణంలో మహిళ అందించిన చీర ఐదుగురి ప్రాణాలను నిలిపింది. ఇక ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అందులో మహిళ తన చీరను ఏ విధంగా ఉపయోగించి కాపాడిందో స్పష్టంగా అర్ధమవుతుంది. ఒకవేళ ఆ సమయానికి మహిళ సాయం చేసి ఉండకుంటే ఐదుగురు ప్రాణాలు కూడా గాలిలో కలిసిపోయేవి.
https://youtube.com/watch?v=EsDDOzWuR8Y