Jr NTR Sons : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్ సినిమాతో మంచి పేరు ప్రఖ్యాతలు దక్కించుకున్నాడు. ఈ సినిమా కోసం రామ్ చరణ్, ఎన్టీఆర్ చాలా కష్టపడ్డారు. ఫ్యామిలీకి కూడా చాలా దూరంగా ఉండాల్సి వచ్చింది. ఇక కొంత గ్యాప్ తర్వాత ప్రస్తుతం దేవర సినిమాలో నటిస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఇక ఎన్టీఆర్ నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కొరటాలవ శివ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా, తను తెరకెక్కించిన ఆచార్య సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోకపోవడంతో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేసి తన సత్తా ఏంటో నిరూపించుకోవాలి అని అనుకుంటున్నాడు కొరటాల శివ. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన జనతా గ్యారేజ్ సినిమాతో మంచి హిట్ అందుకున్నారు.
చిత్రానికి దేవర అనే ఒక పవర్ఫుల్ టైటిల్ను ఈ సినిమాకి ఖరారు చేశారు. ఇక ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ చాలా డిఫరెంట్ లుక్ తో అందరినీ ఆకట్టుకున్నాడు. సముద్రం బ్యాక్ డ్రప్ లో ఈ సినిమా ఉండబోతుందని పోస్టర్‌ని బట్టి క్లారిటీ వచ్చింది. ఇక ఈ సినిమాతో పాటు బాలీవుడ్ చిత్రం వార్ 2లోను నటించబోతున్నాడు ఎన్టీఆర్. ఇక రానున్న రోజులలో చాలా టైట్ షెడ్యూల్ ఉండనున్న నేపథ్యంలో కాస్త బ్రేక్ తీసుకున్నాడు ఎన్టీఆర్. తాతగారి శతజయంతి వేడుకలు పూర్తి చేసుకున్న తారక్.. సాయంత్రం ఫ్యామిలీతో వెకేషన్ కి వెళుతూ శంషాబాద్ విమానాశ్రయంలో మెరిశారు.
ప్రస్తుతం ఎన్టీఆర్ ఫ్యామిలీకి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తారక్ , లక్ష్మి ప్రణతి దంపతులు.. వారితో పాటు పిల్లలు భార్గవ్ రామ్, అభయ్ రామ్ క్యూట్ లుక్స్ లో కనిపిస్తున్నారు. చిన్న కొడుకు భార్గవ్ రామ్ అయితే తండ్రి చేయి పట్టుకుని విమానాశ్రయంలో బుడిబుడి అడుగులు వేస్తుండడం ప్రతి ఒక్కరిని ఆకర్షించింది.. ఈ చిన్న వెకేషన్ పూర్తయ్యాక తిరిగి ఎన్టీఆర్ దేవర షూటింగ్ తో బిజీ కానున్నారు. ఈ చిత్రం తన కెరీర్ లోనే దేవర బెస్ట్ మూవీ అవుతుందని ఇప్పటికే కొరటాల మాట ఇవ్వడంతో అందరు భారీ అంచనాలే పెట్టుకున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…