Natu Natu Puppet Show : నాటు నాటు పాట‌కి తోలు బొమ్మ‌లు అదిరిపోయే స్టెప్పులు.. వీడియో వైర‌ల్‌..

Natu Natu Puppet Show : ఆర్ఆర్ఆర్ మూవీలోంచి నాటు నాటు సాంగ్ ప్రపంచాన్నిఎంత‌గా షేక్ చేసిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. సాంగ్ విడుద‌లైన‌ప్ప‌టి నుండి ఎక్క‌డో చోట ఈ పాట సంచ‌ల‌నం సృష్టిస్తూనే ఉంది. వివిధ రంగాల సెలబ్రిటీల నుంచి మొదలుకుని సాధారణ జనం వరకు నాటు నాటు సాంగ్ పై ఏదో ఒక క్రేజీ యాంగిల్లో వీడియో షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం.. అది కాస్తా వైరల్ గా మారడం గత కొన్ని రోజులుగా గ‌మ‌నిస్తూనే ఉన్నాం. సామాన్యులు, సెలబ్రిటీలు అనే వ్యత్యాసం లేకుండా ప్రతి ఒక్కరూ నాటు నాటు పాటకు ఊగిపోతున్నారు. కెనడా, జపాన్, అమెరికాలోనూ ఈ పాటకు డ్యాన్స్ కట్టడాన్ని చూశాం. ఆస్కార్ వేదికపైనా ప్రత్యేకంగా ఈ పాటకు నృత్యం చేయించారు.

తాజాగా ప్రముఖ బిజినెస్ మేన్.. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఆనంద్ మహింద్రా నాటు నాటు సాంగ్‌కి సంబంధించిన ఒక వైరల్ వీడియోను సోష‌ల్ మీడియాలో షేర్ చేసారు. తాను ఈ వీడియోను షేర్ చేయకుండా ఉండలేకపోతున్నాను అంటూ ఆనంద్ మహింద్రా పోస్ట్ చేసిన ఆ వీడియోను చూస్తే.. ఎవ్వరైనా ఫిదా అయిపోతారు. ఇంత‌కు ఆ వీడియోలో ఏముంది అంటే నాటు నాటు పాటకు నీటుగా స్టెప్పులేసింది మనిషి కాదు.. మర బొమ్మ. అవును.. పొట్టకూటి కోసం బొమ్మలాడించుకోవడం చూసే ఉంటారు కదా.

Natu Natu Puppet Show anand mahindra shared video viral
Natu Natu Puppet Show

అది ఒక అరుదైన కళ కాగా, నాటు నాటు సాంగ్‌కి ఒక లేడీ తన బొమ్మతో స్టెప్పులేయిస్తున్న వీడియో చూస్తే ఎవ్వరైనా ఔరా అని ముక్కున వేలేసుకోవాల్సిందే. ఓ తోలుబొమ్మతో నాటు నాటు పాటకు అదరిపోయే మాదిరిగా డ్యాన్స్ చేయించడం అన్నది అంత సులభమైనది అయితే కాదు కాని, ఓ మహిళ చేయించిన నాటు నాటు డ్యాన్స్ వీడియోని ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. ‘ఒకే ఒకే ఒక లాస్ట్ ట్వీట్. నాటు నాటు పై నేను ఒక హామీ ఇస్తున్నాను. ప్రపంచవ్యాప్తం అనే దానికి ఇదే నిదర్శనం. ఎందుకంటే ఇప్పుడు ఇది ప్రపంచం మొత్తాన్ని తన తీగలపై కలిగి ఉంది’’ అని ఆనంద్ మహీంద్రా త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago