Shaakuntalam Jewelry : శాకుంత‌లం మూవీలో స‌మంత పెట్టుకుంది నిజ‌మైన న‌గలేన‌ట‌.. వాటి ఖ‌రీదు ఎంతో తెలుసా..?

Shaakuntalam Jewelry : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత న‌టించిన తాజా చిత్రం శాకుంత‌లం. ఈ మ‌ధ్య వ‌రుస సినిమాల‌తో తెగ సంద‌డి చేస్తున్న స‌మంత య‌శోద త‌ర్వాత శాకుంత‌లం చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను సోషియో ఫాంటసీగా తెరకెక్కించారు గుణశేఖర్. కాళిదాసు ర‌చించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా ఎపిక్ ఫిల్మ్ మేక‌ర్ గుణ శేఖ‌ర్ రూపొందించిన పౌరాణిక ప్రేమ కావ్యం ‘శాకుంతలం కాగా, విజువ‌ల్ వండ‌ర్‌తో పాన్ ఇండియా ప్రేక్ష‌కుల‌ను మెస్మ‌రైజ్ చేయ‌టానికి సిద్ధ‌మ‌వుతున్నారు.

ఈ సినిమాకి సంబంధించిన అనేక ఆస‌క్తిక‌ర విష‌యాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. దుష్యంతుడి రాజమహల్‌లో దేవతలు, రాజుల పాత్రలకు భారీగా నగలు వాడాల్సి ఉండ‌గా, ఈ చిత్రం కోసం వాడిన నగల విలువ తెలిస్తే మాత్రం మైండ్‌ బ్లాక్‌ అయిపోవాల్సిందే. ఈ సినిమాలో కేజీలకు కేజీల బంగారు అభరణాలు వాడినట్టుగుణ‌శేఖ‌ర్ తెలిపారు. వాటి విలువ సుమారు రూ.14కోట్లు ఉంటుందన్నారు. ఈ చిత్రంలో జ్యూవెల్లరి ఎలా అనుకున్నప్పుడు నీలిమా సుంధర జ్యూవెల్లరీ వారితో మాట్లాడి డీల్ కుదుర్చుకున్నార‌ట‌. వాళ్లు ఆరేడు నెలల పాటు దీనిపై కూర్చొని దాదాపు 14 కేజీల బంగారం వాడి శకుంతల ఆభరణాలు డిజైన్‌ చేశారని గుణ‌శేఖ‌ర్ పేర్కొన్నాడు.

Shaakuntalam Jewelry do you know the cost of them
Shaakuntalam Jewelry

చిత్రంలో అన్నీ కూడా నిజమైన బంగారం, వజ్రాలను వాడినట్టు చెప్పారు. సీనియర్‌ ఎన్టీఆర్‌ నటించిన `దానవీర శూర కర్ణ` చిత్రంలో వాళ్లు ధరించిన నిజమైన బంగారు ఆభరణాలు, కిరీటాలను స్ఫూర్తిగా తీసుకుని తాను కూడా నిజమైన బంగారం వాడామ‌ని స్ప‌ష్టం చేశారురు. అయితే ఇంతటి బంగారు ఆభరణాలను మేం తయారు చేయించాలంటే ఏకంగా ఓ పెద్ద జ్యూవెల్లరి షాపే పెట్టుకోవచ్చని, దిల్‌రాజుగారికి చెబితే ఇదే మాట అనేవారని, ఆయనకు వసుంధర వాళ్లు ఇలా టై అప్ అయ్యార‌ని , దీంతో మేం రిలీఫ్ అయ్యామ‌ని గుణ‌శేఖ‌ర్ స్ప‌ష్టం చేశారు. వసుంధర, ప్రముఖ డిజైనర్‌ నీతా లుల్లా, నేహ వంటి వారు ప‌లు డిజైన్స్ చేశారని, శకుంతల పాత్రకి 15కేజీల బంగారంతో 14 రకాల ఆభరణాలు చేశార‌ని అన్నాడు. అలాగే దుష్యంతుడి పాత్ర కోసం దాదాపు పది కేజీల బంగారు ఆభరణాలు, మేనక పాత్ర ధారి అయిన మధుబాల కోసం ఆరు కోట్లతో వజ్రాలు పొదిగిన దుస్తులను, బంగారు ఆభరణాలను తయారు చేయించామని చెప్పుకొచ్చారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

4 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

4 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago