Natu Natu Puppet Show : ఆర్ఆర్ఆర్ మూవీలోంచి నాటు నాటు సాంగ్ ప్రపంచాన్నిఎంతగా షేక్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సాంగ్ విడుదలైనప్పటి నుండి ఎక్కడో చోట ఈ పాట సంచలనం సృష్టిస్తూనే ఉంది. వివిధ రంగాల సెలబ్రిటీల నుంచి మొదలుకుని సాధారణ జనం వరకు నాటు నాటు సాంగ్ పై ఏదో ఒక క్రేజీ యాంగిల్లో వీడియో షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం.. అది కాస్తా వైరల్ గా మారడం గత కొన్ని రోజులుగా గమనిస్తూనే ఉన్నాం. సామాన్యులు, సెలబ్రిటీలు అనే వ్యత్యాసం లేకుండా ప్రతి ఒక్కరూ నాటు నాటు పాటకు ఊగిపోతున్నారు. కెనడా, జపాన్, అమెరికాలోనూ ఈ పాటకు డ్యాన్స్ కట్టడాన్ని చూశాం. ఆస్కార్ వేదికపైనా ప్రత్యేకంగా ఈ పాటకు నృత్యం చేయించారు.
తాజాగా ప్రముఖ బిజినెస్ మేన్.. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఆనంద్ మహింద్రా నాటు నాటు సాంగ్‌కి సంబంధించిన ఒక వైరల్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసారు. తాను ఈ వీడియోను షేర్ చేయకుండా ఉండలేకపోతున్నాను అంటూ ఆనంద్ మహింద్రా పోస్ట్ చేసిన ఆ వీడియోను చూస్తే.. ఎవ్వరైనా ఫిదా అయిపోతారు. ఇంతకు ఆ వీడియోలో ఏముంది అంటే నాటు నాటు పాటకు నీటుగా స్టెప్పులేసింది మనిషి కాదు.. మర బొమ్మ. అవును.. పొట్టకూటి కోసం బొమ్మలాడించుకోవడం చూసే ఉంటారు కదా.
![Natu Natu Puppet Show : నాటు నాటు పాటకి తోలు బొమ్మలు అదిరిపోయే స్టెప్పులు.. వీడియో వైరల్.. Natu Natu Puppet Show anand mahindra shared video viral](http://3.0.182.119/wp-content/uploads/2023/03/natu-natu-puppet-show.jpg)
అది ఒక అరుదైన కళ కాగా, నాటు నాటు సాంగ్‌కి ఒక లేడీ తన బొమ్మతో స్టెప్పులేయిస్తున్న వీడియో చూస్తే ఎవ్వరైనా ఔరా అని ముక్కున వేలేసుకోవాల్సిందే. ఓ తోలుబొమ్మతో నాటు నాటు పాటకు అదరిపోయే మాదిరిగా డ్యాన్స్ చేయించడం అన్నది అంత సులభమైనది అయితే కాదు కాని, ఓ మహిళ చేయించిన నాటు నాటు డ్యాన్స్ వీడియోని ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ హల్‌చల్ చేస్తుంది. ‘ఒకే ఒకే ఒక లాస్ట్ ట్వీట్. నాటు నాటు పై నేను ఒక హామీ ఇస్తున్నాను. ప్రపంచవ్యాప్తం అనే దానికి ఇదే నిదర్శనం. ఎందుకంటే ఇప్పుడు ఇది ప్రపంచం మొత్తాన్ని తన తీగలపై కలిగి ఉంది’’ అని ఆనంద్ మహీంద్రా తన ట్వీట్‌లో పేర్కొన్నారు.