Pakeezah : పాకీజా ఒకప్పుడు తన నటనతో ఎంత అదరగొట్టిందో మనం చూశాం.అయితే విచిత్ర పరిస్థితుల వలన తాను రోడ్డున పడాల్సి వచ్చింది. కొన్ని రోజుల క్రితం వరకు వ్యక్తిగత జీవితంలో గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్న పాకీజా మళ్లీ ముఖానికి రంగు వేసుకుంది. సిల్వర్ స్ర్కీన్‌పై కాకపోయినా ఎంతో మందికి జీవితాన్ని ఇస్తోన్న బుల్లితెరపైకి అడుగుపెట్టింది. ఇది ఆమెకు కొత్త జీవితం అని చెప్పలేం కానీ ఆ దశలో మొదటి అడుగు మాత్రం అని కచ్చితంగా చెప్పవచ్చు. పాకీజా పరిస్థితి చూసి చలించిపోయిన నాగబాబు ఆర్ధిక సాయం చేయగా, చిరంజీవి సైతంకొంత సాయం చేశారు. ఆమెను ఆదుకోవాలని చెప్పారు.
తాజాగా సెలబ్రిటీ థీమ్ అనే ఈవెంట్ ను నిర్వహించారు జబర్దస్త్ లో. ఇందులో భాగంగా ముందుగా కెవ్వు కార్తీక్ టీమ్ పర్ఫార్మెన్స్ చేసింది. ఆ తర్వాత పాకీజా గ్లాసెస్ పెట్టుకుని స్టైల్ గా డ్యాన్స్ చేసుకుంటూ వచ్చింది. అంతలోనే రైజింగ్ రాజు వచ్చి ఆమెకు డ్యాష్ ఇచ్చాడు. దాంతో ఆమె పడిపోతుంటే పట్టుకుంటాడు రాజు. బరువున్నానా అని ఆమె అడగ్గా.. డాక్టర్లు వేసిన స్టంట్ కంటే బరువేం లేవు అంటూ చెబుతాడు రాజు. దాంతో నవ్వులు పూస్తాయి. ఇక తెర మీద ఆమెను చాలా కాలం తర్వాత చూడటంతో అంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ఇలా మొత్తానికి పాకీజా ఎంట్రీతో ఎక్స్‌ట్రా జబర్దస్త్ ఫ్యాన్స్ తెగ కామెంట్లు పెడుతున్నారు. ఆమెను ఈ షోలో కొనసాగించి, ఆదుకోవాలని కోరుతున్నారు.
సుమారు 150కి పైగా సినిమాల్లో నటించి మెప్పించిన పాకీజా టాలీవుడ్ సెలబ్రిటీల సహాయంతో కొంత తేరుకుంది. ఇటీవల మా అధ్యక్షుడు విష్ణు కూడా తన సొంత డబ్బులతో మా అసోసియేషన్ కార్డు కూడా ఇప్పించారు. ఇప్పుడిప్పుడే ఆమెకు బుల్లితెర వెండితెర ఆఫర్స్ కూడా వస్తుండడంతో కొంత తేరుకుంటున్నట్టు కనిపిస్తుంది. రానున్న రోజులలో ఆమె మళ్లీ బిజీ కానుందని అంటున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…