Nara Lokesh : ప్రస్తుతం ఏపీ రాజకీయాలు వాడివేడిగా సాగుతున్న విషయం తెలిసిందే. నారా లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర చేస్తూ వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. అలానే ప్రజల సమస్యల గురించి తెలుసుకుంటున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ఒంగోలు, సంతనూతలపాడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉత్సాహంగా సాగుతూ పోయింది.ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అన్ని రంగాల నిపుణులు బాధితులే అని అసహనం వ్యక్తం చేశారు. ఏపీలో ఎకనామిక్ యాక్టివిటీని పూర్తిగా నిలిపివేసి రాష్ట్రాన్ని ఆర్థికంగా చితికిపోయేలా చేశారని మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరిగి అభివృద్ధి చెందాలంటే టీడీపీ అధికారంలోకి రావాల్సిందేనని నారా లోకేష్ చెప్పారు. అప్పు చేసి సంక్షేమం చేయడం గొప్ప కాదని.. సంపద సృష్టించి సంక్షేమ పథకాలు అమలు చేసే సామర్థ్యం రాష్ట్రానికి రావాలన్నారు. నిపుణులందరూ ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని లోకేష్ అభిప్రాయపడ్డారు. టీడీపీ అధికారంలోకి వస్తే రాయలసీమని ఎలక్ట్రానిక్స్ అండ్ ఆటోమొబైల్ హబ్‌గా తయారు చేస్తామని హామీ ఇచ్చారు. విశాఖపట్నంను ఐటీ హబ్‌గా మారుస్తామని చెప్పారు. టీడీపీ హయాంలో 6 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయని వైసీపీ ప్రభుత్వమే శాసనసభ సాక్షిగా ప్రకటించిందన్నారు.
అయితే నారా లోకేష్ సాక్షిగా ఓ యువతి చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ఏపీలో రాను రాను చదువుకున్న వాళ్ల పరిస్థితి దారుణంగా మారింది. రానున్న రోజులలో రైతు బజార్‌లో టమాటాలు అమ్ముకోవడానికి బీటెక్ గ్రాడ్యుయేట్ కావాలి, రోడ్లన్ని మా పార్టీ రంగులు వేయడానికి ఎంటెక్ గ్రాడ్యుయేట్ కావలెను. కాని జీతం అయిదు వేలకు మించదు. చంద్రబాబు వలన చదువుకున్న వాళ్లకి ఉపాధి దక్కింది. కాని ఇప్పుడు ప్రభుత్వం వలన మేమందరం ఎన్నో కష్టాలు పడుతున్నాం. మీరు ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చారు. కాని ఇప్పుడు మా కోడి గుడ్డు కష్టాలు చెప్పుకోవడానకి, అవి విని అర్ధం చేసుకోవడానికి ఉన్న ఒకే వ్యక్తి మీరు అన్న అని లోకేష్‌కి తెలియజేసింది ఓ యువతి. ఇప్పుడు ఆ యువతి కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…