Dil Raju : ఇటీవల సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఎన్నికలు ఎంత రసవత్తరంగా మారుతున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మా ఎన్నికల తర్వాత తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి ఎలక్షన్స్ అంత హోరా హోరీగా సాగాయి . ఈ ఎన్నికల్లో అగ్ర నిర్మాతలు అయినా సి. కల్యాణ్, దిల్ రాజు పోటీ పడ్డారు. దిల్ రాజు ప్యానెల్ ను విజయం వరించింది. సి. కల్యాణ్ ప్యానెల్ ను ఓడించి దిల్ రాజు ప్యానెల్ గెలుపు జెండాను ఎగురవేసింది. ప్రొడ్యూసర్ సెక్టార్ లోని మొత్తం 12 స్థానాలకు ఏడింటిలో దిల్ రాజు ప్యానెల్ విజయ కేతనం ఎగురవేసింది. ఇక డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ లో రెండు ప్యానెల్స్ నుంచి చెరో ఆరుగురు విజయం అందుకున్నారు. ఎగ్జిబిటర్స్ సెక్టార్ లో ఏక గ్రీవంగా ఎన్నికైన వారు కూడా దిల్ రాజుకు మద్దతు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
స్టూడియో సెక్టార్ లో గెలుపొందిన నలుగురిలో ముగ్గురు దిల్ రాజు ప్యానల్ వారే కావడం విశేషం. నిర్మాతల విభాగంలో దిల్ రాజు ప్యానెల్ నుంచి 12 మందిలో ఏడుగులు గెలుపొందారు. వైస్ ప్రెసిడెంట్ గా ముత్యాల రామదాసు, కార్యదర్శి గా దామోదర్ ప్రసాద్, ట్రెజరర్‌గా ప్రసన్న కుమార్ ఎన్నికయ్యారు. మొత్తం 48 ఓట్లలో నిర్మాత దిల్ రాజుకి 31 ఓట్లు పడ్డాయి. దిల్ రాజుకు మెజారిటీ రావడంతో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడుగా ఎన్నికైయారు. ఇక ప్రొడ్యూసర్ సెక్టర్ చైర్మన్‌గా శివలంక ప్రసాద్, డిస్ట్రిబ్యూటర్ సెక్టర్ ఛైర్మన్‌గా మిక్కిలినేని సుధాకర్, జాయింట్ సెక్రటరీగా భరత్ చౌదరిలు గెలుపొందారు.
ఎన్నికలకి ముందు దిల్ రాజు మీడియా సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాలిటిక్స్‌లోకి వస్తున్నారు కదా.. ఈ ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు ట్రైల్ రన్ అనుకోవచ్చా? అని ఓ రిపోర్టర్ అడగడంతో.. దిల్ రాజు నువ్వుతూ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. ‘నేను రాజకీయాల్లోకి వస్తానని ఎప్పుడూ మీకు చెప్పలేదు కానీ.. అది జరుగుతుంది. తరువాత ఏమి అవుతుందో ఎలా చెప్తారు? కానీ మీరు అన్నట్టుగా రాజకీయాల్లోకి వెళ్తే ఏ పార్టీ అయినా సరే ఎంపీగానో.. ఎమ్మెల్యేగానో.. ఇంకోటో సీటు ఇవ్వొచ్చు నేను గెలవొచ్చు. కానీ రాజకీయాలు వేరు.. ఇండస్ట్రీ వేరు . నేను ప్రెసిడెంట్‌గా నిలబడితే.. కిరీటాలు ఏమీ రావుకదా. నేను వెళ్లి ఆ కుర్చీలో కూర్చుంటే నాకు ఇంకా సమస్యలు పెరుగుతాయి. కిరీటాలు పెట్టరు. నా ప్రశాంతత పోతుంది. అయినా సరే ఎలక్షన్స్‌లో పోటీ చేస్తున్నాం అని చెప్పుకొచ్చారు దిల్ రాజు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…