Brahmanandam : కేసీఆర్‌ని క‌లిసిన స‌మ‌యంలో ముక్కు గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన బ్ర‌హ్మానందం

Brahmanandam : మ‌రి కొద్ది రోజుల‌లో బ్ర‌హ్మానందం ఇంట పెళ్లి వేడుక జ‌ర‌గ‌నుంది. ప్రస్తుతం ఆ పెళ్లి ప‌నుల‌తో బిజీగా ఉన్నారు బ్ర‌హ్మానందం. రీసెంట్‌గా బ్ర‌హ్మానందం -లక్ష్మి దంపతులు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావును కలిశారు. పెద్ద కొడుకు గౌతమ్‌తో కలిసి ప్రగతి భవన్‌లో చిన్న కొడుకు సిద్ధార్థ్‌ పెళ్లికి రావాలని సీఎం కేసీఆర్‌ దంపతులకు ఆహ్వానపత్రికను అందజేశారు. అయితే తన నివాసానికి వచ్చిన బ్రహ్మానందం దంపతులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ స్వాగతం పలికారు. బ్రహ్మానందంను ఆప్యాయంగా హత్తుకున్నారు. పలు అంశాలపై కొద్దిసేపు చర్చించుకున్నారు. ఈ సందర్భంగా తాను స్వయంగా గీసిన తిరుమల శ్రీవారి పెన్సిల్ డ్రాయింగ్‌ను బ్రహ్మానందం సీఎం కేసీఆర్ కు బహూకరించారు.

వారిద్ద‌రు ముచ్చ‌టించుకుంటున్న స‌మ‌యంలో కేసీఆర్ ముక్కు ప్ర‌స్తావ‌న కూడా వ‌చ్చిన‌ట్టు తెలుస్తుంది. మీ ముక్కు భ‌లే బాగుందిగా అంటూ బ్ర‌హ్మీ స‌ర‌దాగా కామెంట్స్ చేసిన‌ట్టు తెలుస్తుంది. బ్ర‌హ్మానందం- కేసీఆర్‌ల‌ని ఒకే ఫ్రేములో చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అయ్యారు. ఇక బ్రహ్మానందం పెద్దకుమారుడు రాజా గౌతమ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. పలు చిత్రాల్లో హీరోగా నటించిన గౌతమ్‌.. ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నాడు.ఇక రెండో తనయుడు సిద్ధార్థ్‌ గురించి పెద్దగా ఎవరికీ తెలియలేదు. మొదటి నుంచి సినిమాలకు దూరంగా ఉంటున్న అత‌ను .. విదేశాల్లో విద్యనభ్యసించారు. అమెరికాలో ఉద్యోగం చేస్తూ అక్కడే స్థిరపడ్డాడు. ఇక సిద్ధార్థ్‌ ఈ ఏడాది మేలో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే.

Brahmanandam met cm kcr to invite to his son wedding
Brahmanandam

నిశ్చితార్థం త‌ర్వాతే బ్రహ్మానందంకు రెండో తనయుడి గురించి అందరికీ తెలిసింది. హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ పద్మజా వినయ్ కుమార్తె ఐశ్వర్యను సిద్ధార్థ్ పెళ్లి చేసుకోబుతున్నారు. ఆమె సైతం డాక్టర్‌గా సేవలందిస్తున్నది. మే 21న హైదరాబాద్‌లో అట్టహాసంగా జరిగిన సిద్ధార్థ్ – ఐశ్వర్య నిశ్చితార్థ వేడుక జర‌గ‌గా, ఈ కార్య‌క్ర‌మానికి పలువురు సినీ ప్రముఖులతో పాటు వ్యాపార, రాజకీయ రంగ ప్రముఖులు కూడా హాజరయ్యారు. ఇక వారి పెళ్లి త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌బోతున్న‌ట్టు తెలుస్తుంది.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

3 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

3 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

3 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

3 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

3 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

3 months ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

3 months ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

3 months ago