Brahmanandam : మరి కొద్ది రోజులలో బ్రహ్మానందం ఇంట పెళ్లి వేడుక జరగనుంది. ప్రస్తుతం ఆ పెళ్లి పనులతో బిజీగా ఉన్నారు బ్రహ్మానందం. రీసెంట్‌గా బ్రహ్మానందం -లక్ష్మి దంపతులు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావును కలిశారు. పెద్ద కొడుకు గౌతమ్‌తో కలిసి ప్రగతి భవన్‌లో చిన్న కొడుకు సిద్ధార్థ్ పెళ్లికి రావాలని సీఎం కేసీఆర్ దంపతులకు ఆహ్వానపత్రికను అందజేశారు. అయితే తన నివాసానికి వచ్చిన బ్రహ్మానందం దంపతులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ స్వాగతం పలికారు. బ్రహ్మానందంను ఆప్యాయంగా హత్తుకున్నారు. పలు అంశాలపై కొద్దిసేపు చర్చించుకున్నారు. ఈ సందర్భంగా తాను స్వయంగా గీసిన తిరుమల శ్రీవారి పెన్సిల్ డ్రాయింగ్‌ను బ్రహ్మానందం సీఎం కేసీఆర్ కు బహూకరించారు.
వారిద్దరు ముచ్చటించుకుంటున్న సమయంలో కేసీఆర్ ముక్కు ప్రస్తావన కూడా వచ్చినట్టు తెలుస్తుంది. మీ ముక్కు భలే బాగుందిగా అంటూ బ్రహ్మీ సరదాగా కామెంట్స్ చేసినట్టు తెలుస్తుంది. బ్రహ్మానందం- కేసీఆర్‌లని ఒకే ఫ్రేములో చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అయ్యారు. ఇక బ్రహ్మానందం పెద్దకుమారుడు రాజా గౌతమ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. పలు చిత్రాల్లో హీరోగా నటించిన గౌతమ్.. ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నాడు.ఇక రెండో తనయుడు సిద్ధార్థ్ గురించి పెద్దగా ఎవరికీ తెలియలేదు. మొదటి నుంచి సినిమాలకు దూరంగా ఉంటున్న అతను .. విదేశాల్లో విద్యనభ్యసించారు. అమెరికాలో ఉద్యోగం చేస్తూ అక్కడే స్థిరపడ్డాడు. ఇక సిద్ధార్థ్ ఈ ఏడాది మేలో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే.
నిశ్చితార్థం తర్వాతే బ్రహ్మానందంకు రెండో తనయుడి గురించి అందరికీ తెలిసింది. హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ పద్మజా వినయ్ కుమార్తె ఐశ్వర్యను సిద్ధార్థ్ పెళ్లి చేసుకోబుతున్నారు. ఆమె సైతం డాక్టర్‌గా సేవలందిస్తున్నది. మే 21న హైదరాబాద్‌లో అట్టహాసంగా జరిగిన సిద్ధార్థ్ – ఐశ్వర్య నిశ్చితార్థ వేడుక జరగగా, ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులతో పాటు వ్యాపార, రాజకీయ రంగ ప్రముఖులు కూడా హాజరయ్యారు. ఇక వారి పెళ్లి త్వరలోనే జరగబోతున్నట్టు తెలుస్తుంది.