డేగ పిట్టని ఎత్తుకెళ్లినట్టు నా పరిస్థితి మారింది. ఇంట్లో తన భార్య ఉన్నా కూడా నేను అన్నం పెట్టలేదని కొట్టాడు, చాలా టార్చర్ పెట్టాడు అంటూ మాజీ మంత్రి నారాయణపై సంచలన ఆరోపణలు చేసింది ఆయన తమ్ముడి భార్య ప్రియ. హైదరాబాద్ రాయదుర్గం పోలీసు స్టేషన్‌కు వెళ్లిన ప్రియ.. మాజీమంత్రి నారాయణపై ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రి నారాయణ.. తనను లైంగికంగా వేధిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది. గత కొన్ని రోజులుగా నారాయణపై ప్రియ ఇన్‌స్టాగ్రామ్‌లో పలు వీడియోలు విడుదల చేస్తున్న నేపథ్యంలో… నారాయణ తనను వేధిస్తున్నారని, వీడియోలు విడుదల చేసిన తర్వాత ఆ వేధింపులు మరింత ఎక్కువయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.
నారాయణ వేధింపులు తట్టుకోలేక తాను పోలీసులను ఆశ్రయించినట్టు చెప్పుకొచ్చింది. గత ఎన్నికల సమయంలో తనను ప్రచారం చెయ్యాలని నారాయణ ఇబ్బంది పెట్టారని ప్రియ ఆవేదన వ్యక్తం చేశారు. తన కుటుంబాన్ని కూడా నారాయణ అనేక ఇబ్బందులు పెట్టారని ఆరోపించారు. ప్రియ చేసిన కామెంట్స్‌తో వెంటనే ఫ్రేములోకి వచ్చాడు నారాయణ తమ్ముడు సుబ్రహ్మణ్యం . ఆయన మాట్లాడుతూ… తన భార్య మానసిక పరిస్థితి బాగోలేక పోవడం వల్లనే తన అన్నం నారాయణ మీద ఆరోపణలు చేస్తూ వీడియో చేసిందని అన్నారు.
అయితే తన భర్త తన మీద చేసిన వ్యాఖ్యలకు స్పందించిన కృష్ణప్రియ.. మాజీ మంత్రి నారాయణ, తన భర్త సుబ్రహ్మణ్యం తనను వేధిస్తూ, బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. భర్త విడుదల చేసిన వీడియోను చూసిన భార్య కృష్ణప్రియ వెంటనే రాయదుర్గం పోలీస్ స్టేషన్లో తన భర్త, నారాయణ మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది. అన్నా తమ్ములిద్దరు కలిసి తనను వేధిస్తూ.. బెదిరింపు లకు పాల్పడుతున్నారని తన ఫిర్యాదులో పేర్కొంది. ఇలా నవ్వుతూ మాట్లాడుతున్నందుకు అందరికీ అనుమానం వస్తుంది. కానీ నిజంగానే నారాయణ తనను వేధింపు లకు గురి చేసేవాడని ఆవేదన వ్యక్తం చేసింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…