Priya Prakash Varrier : పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రలలో రూపొందిన బ్రో చిత్రం మంచి హిట్ కొట్టిన విషయం మనందరకి తెలిసిందే. ఈ చిత్రంలో కేతిక శర్మ, ప్రియ ప్రకాశ్ వారియర్ ముఖ్య పాత్రలలో నటించారు. సినిమాకి మంచి రెస్పాన్స్ రావడంతో అందరు సంతోషంగా ఉన్నారు. అయితే తెలుగులో ప్రియా ప్రకాశ్ పలు సినిమాలు చేసిన కూడా పెద్దగా పేరు తెచ్చుకోలేకపోయింది. బ్రో సినిమాతో ప్రియా ప్రకాశ్ వారియర్ చాలా సంతోషంగా ఉన్నట్టు కనిపిస్తుంది. కెరీర్ ప్రారంభంలోనే పవన్‌కల్యాణ్ లాంటి గొప్ప నటుడితో కలిసి నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను అని చెప్పింది.
గత చిత్రాలతో పోలిస్తే నేను చిత్రంలో కొత్తగా కనిపించింది ప్రియా ప్రకాశ్. ఇందులో తన పాత్ర పేరు వీణ. హోమ్లీ గర్ల్ లాంటి పాత్ర. తప్పకుండా ఈ చిత్రం నా కెరీర్‌లో గుర్తుండిపోతుంది అని చెప్పుకొచ్చింది. మాతృకతో పోలిస్తే ‘బ్రో’ సినిమాలో చాలా మార్పులు చేశారు. పవన్‌కల్యాణ్ గారి ఇమేజ్‌కు తగ్గట్టుగా, సినిమాలో సోల్ మిస్ అవ్వకుండా మార్పులు చేశారు. చాలా కొత్త సన్నివేశాలు ఈ చిత్రంలో ఉంటాయి. ఇదొక మంచి కుటుంబ కథా చిత్రం. అందరి హృదయాలకు హత్తుకునే సినిమా ఇది. సినిమాల ఎంపిక విషయంలో మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతున్నాను. చిన్నప్పటి నుంచి నాకు గొప్ప నటి కావాలని ఆశ ఉండేది. ఆ దిశగానే నా అడుగులు సాగుతున్నాయి అని ప్రియా ప్రకాశ్ చెప్పుకొచ్చింది.
ఇక సినిమా రిలీజ్ తర్వాత ప్రియా ప్రకాశ్ మాట్లాడుతూ.. థియేటర్‌లో పవన్ కళ్యాణ్ అభిమానుల రెస్పాన్స్ చూసి షాక్ అయ్యాను. ఆయన ఆరా అద్భుతం. నాకు చిత్రంలో మంచి రోల్ దక్కింది. పవన్ కళ్యాణ్ తో కలిసి నటించిడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి మంచి అవకాశం తనకు ఇచ్చినందుకు సంతోషం వ్యక్తం చేసింది ప్రియ ప్రకాశ్. ప్రస్తుతం ఈ అమ్మడి వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…