Ambati Dance : అంబ‌టి రాంబాబు డ్యాన్స్ చూసి షాకైన సాయిధ‌ర‌మ్ తేజ్.. కావాల‌ని ఎవ‌రిని ఇమిటేట్ చేయ‌లేదు..!

Ambati Dance : ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, సాయి తేజ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో స‌ముద్ర‌ఖని తెర‌కెక్కించిన చిత్రం బ్రో. త‌మిళ మూవీ వినోద‌య సిత్తంకి రీమేక్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రం తొలి రోజు మంచి క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. అయితే సినిమాకి హిట్ టాక్ ద‌క్క‌గా, అదే స‌మ‌యంలో మూవీ చుట్టూ వివాదం న‌డుస్తుంది. చిత్రంలో వింటేజ్ పవన్ కళ్యాణ్‌ను చూపించడమే కాకుండా పరోక్షంగా ఏపీ సీఎం వై.ఎస్.జగన్, నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబుపై వేసిన పంచులు, డైలాగులు కూడా పవర్ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. కాక‌పోతే వైసీపీ నాయ‌కులు మాత్రం దీనిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

చిత్రంలో అంబంటి రాంబాబు డాన్స్‌ను ఉద్దేశించి సినిమాలో క్రియేట్ చేసిన ఒక సీన్ నిన్న సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. గతంలో బోగి పండుగ సందర్భంగా సత్తెనపల్లిలో లంబాడి మహిళలతో కలిసి అంబటి రాంబాబు రోడ్డుపై డాన్స్ చేశారు. ఆ డాన్స్‌ను ఎగతాళి చేస్తూ ‘బ్రో’ సినిమాలో ఒక పాటలో చిన్న సీన్ పెట్టారు. రాంబాబు పాత్రను పోలి ఉన్న శ్యాంబాబు పాత్రను కమెడియన్ పృథ్వీ పోషించారు. శ్యాంబాబు వేస్తున్న స్టెప్పులకు టైటన్(పవన్ కళ్యాణ్)కు కోపం వ‌చ్చేసి వెంటనే మ్యూజిక్ ఆపమని శ్యాంబాబుకు టైటన్ క్లాసు పీకుతాడు.

Sai Dharam Tej surprised by Ambati Dance
Ambati Dance

గతంలో అంబటి రాంబాబు డాన్స్ చేసినప్పుడు వేసుకున్న టీషర్ట్‌ను పోలి ఉన్న టీషర్ట్‌నే సినిమాలో పృథ్వీకి వేయడంతో అంద‌రు కూడా రాంబాబుకి గ‌ట్టిగా ఇచ్చాడ‌ని అన్నారు. ఆ స‌య‌యంలో రాంబాబు కూడా స్పందించాడు. పవన్ కళ్యాణ్‌ రాజకీయంగా తనను ఎదుర్కోలేక.. సినిమాల్లో తనను పోలిన పాత్రను పెట్టి, దూషించి శునకానందం పొందుతున్నారని విమర్శించారు.ఇక ఇదే విష‌యంపై సాయి ధ‌ర‌మ్ తేజ్‌ని రిపోర్ట‌ర్‌ ప్ర‌శ్నించ‌గా, ముందుగా అంబ‌టి డ్యాన్స్ చూసి ఆశ్చ‌ర్య‌పోయారు.ఇద్దరి హెయిర్ స్టైల్ వేరుగా ఉందని, పృథ్వీకి మీసాలు లేవని చెప్పారు. మరోవైపు అంబటి రాంబాబు గారు చాలా బాగా డ్యాన్స్ చేశారని కితాబునిచ్చారు. తాము ఎవరిని కించ‌పరిచేలా అలా పెట్ట‌లేద‌ని చెప్పుకొచ్చారు. మీ కంటికి అలా అనిపిస్తుందేమో కాని మేం అలా చేయ‌లేదు అని అన్నాడు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago