Nara Lokesh : చంద్రబాబు అరెస్ట్ తర్వాత నారా ఫ్యామిలీ రాజకీయాలలో చాలా యాక్టివ్‌గా ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. నారా లోకేష్, ఆయన తల్లి భువనేశ్వరి, సతీమణి బ్రాహ్మణి రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుతో ములాఖత్ అయ్యారు. అంతకు ముందు విజయవాడ నుంచి భారీ ర్యాలీతో లోకేష్ రాజమండ్రికి చేరుకున్నారు. చాలా రోజుల తర్వాత అక్కడ భువనేశ్వరి, బ్రాహ్మణిలను లోకేష్ కలుసుకున్నారు. నారా లోకేష్‌ను కలుసుకున్న నారా భువనేశ్వరి, బ్రాహ్మణి భావోద్వేగానికి గురైయ్యారు. కాసేపు అక్కడ ఉద్విగ్న వాతావరణం నెలకొంది. చంద్రబాబుతో ములాఖత్ తర్వాత మీడియాతో మాట్లాడిన నారా లోకేష్.. చంద్రబాబు అరెస్టు వెనుక కేంద్రం హస్తం ఉందనడానికి ఎలాంటి ఆధారాలు లేవన్నారు.
ఆధారాలు లేకుండా తాను ఈ అంశంపై మాట్లాడనని లోకేష్ స్పష్టం చేశారు. ఢిల్లీలో తాను ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలను కలిసేందుకు వారి అపాయింట్‌మెంట్లు కోరలేదని చెప్పారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు నాయుడు ధైర్యంగా ఉన్నట్లు చెప్పారు. అయితే జైల్లో ఆయన భద్రత పట్ల తాము ఆందోళనగా ఉందన్నారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో కొందరు నక్సల్స్, గంజాయి కేసుల్లో అరెస్టైన ఖైదీలు ఉన్నారని గుర్తుచేశారు.చంద్రబాబు అరెస్ట్ తర్వాత అందరి చూపు నారా లోకేష్ వైపు వెళ్లింది. కానీ.. బాబు అరెస్ట్ తర్వాత ఢిల్లీకి వెళ్లిపోయిన నారా లోకేష్ అక్కడ దాదాపు 22 రోజుల పాటు ఉండిపోయారు. దాంతో అతని భార్య నారా బ్రాహ్మణి అన్నీ తానై తన అత్త భువనేశ్వరితో కలిసి ఏపీలో దీక్ష, నిరసన, ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది.
ఈ నేపథ్యంలో బ్రాహ్మణి ఒక్కసారిగా టీడీపీలో హైలైట్ అయ్యింది. టీడీపీలో బ్రాహ్మణి పాత్ర గురించి ప్రశ్న రాగానే నారా లోకేష్ తొలుత ఆశ్చర్యంగా రిపోర్ట్ వైపు చూశారు. అనంతరం అదేం ప్రశ్న స్వామి..? అని సమాధానం దాటవేస్తూ తన తల్లి భువనేశ్వరి గురించి చెప్పుకుంటూ వెళ్లారు. అయితే 22 రోజులు ఏపీలో లేని లోకేష్‌కి బ్రాహ్మణికి పెరిగిన క్రేజ్ సరిగా తెలిసినట్లు లేదు. ఈ మూడు వారాలుగా బాబుతో ఏ టీడీపీ నాయకుడు ములాఖత్‌కి వెళ్లినా.. వారి వెంట నోట్‌బుక్‌తో బ్రాహ్మణి ఉంటుంది. పార్టీ వ్యవహారాల్ని బాబుకి చేరవేస్తూ.. అతను చేసే సూచనలను కేడర్‌కి ఆమె వివరిస్తోందని టాక్ బలంగా నడుస్తోంది.యువగళం పాదయాత్ర ఆపేయడంతో ఓ రిపోర్టర్ ప్రశ్న వేయగా, టీవీ 9 రిపోర్టరా ఇతను అని అన్నాడు లోకేష్. ఇంకా సాక్షి రిపోర్టర్ రాలేదా.. ఓహో సాక్షి రిపోర్టర్ వచ్చాడా అంటూ ఫన్ చేశారు లోకేష్.ఇందుకు సంబంధించిన వీడియ్ నెట్టింట హల్చల్ చేస్తుంది.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…