Actress Radhika : ప్రస్తుతం ఏపీ రాజకీయాలు రచ్చగా మారుతున్న క్రమంలో ఒకరిపై ఒకరు దారుణమైన విమర్శలు చేసుకుంటున్నారు. రీసెంట్‌గా మాజీ మంత్రి బండారు సత్యనారాయణ.. రోజాపై దారుణమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మహిళా సంఘాలు, వివిధ పార్టీలు, సామాన్యులు బండారు చేసిన కామెంట్స్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ టూరిజం శాఖ మంత్రి రోజాపై బండారు సత్యనారాయణ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను సీనియర్ నటి రాధిక శరత్ కుమార్ తప్పుబట్టారు. రోజాకు మద్దతుగా తన ఎక్స్ ఖాతాలో వీడియోను రిలీజ్ చేస్తూ… ఒక మహిళపై దిగజారుడు వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు.
సత్యనారాయణ లాంటి రాజకీయ నాయకుడిని చూసి తాను సిగ్గుపడుతున్నట్లు రాధిక వెల్లడించారు. మరోవైపు జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బు సుందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి రోజాకు మద్దతు ప్రకటించారు. బంగారు సత్యనారాయణ వ్యాఖ్యలని తప్పు పడుతూ రోజా చేసిన కామెంట్స్ కి రోజా స్పందిస్తూ.. రాజకీయాల్లోకి వచ్చే మహిళలకు మీరిచ్చే గౌరవం ఇదేనా.. చివరికి మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీని వల్ల భయపడబోమని.. ఇలా మాటలతో హింసించడం సిగ్గు చేటన్నారు. బండారు సత్యనారాయణ వెంటనే క్షమాపణలు చెప్పి ఆయన గౌరవాన్ని కాపాడుకోవాలి అన్నారు.
రోజాకు తాను అండగా ఉంటానని.. ఇంత నీచంగా మాట్లాడటం దారుణం అన్నారు. ఇవి లో క్వాలిటీ పాలిటిక్స్. .మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్న సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు రాజకీయాల్లో మహిళలు ఎదుర్కొంటున్న ఈ వివక్షపై ప్రధాని మోదీ దృష్టి సారించాలి అని వీడియోలో రాధిక తెలిపారు. బండారు వెంటనే రోజాకు క్షమాపణ చెప్పాలని బండారు సత్యనారాయణని డిమాండ్ చేశారు. క్షమాపణలు చెప్పకపోతే రహస్యంగా దొంగలా బతకాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ విషయంలో రోజాకు సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు. అసలు ఇలాంటి పరిస్థితి ఏ మహిళకు వచ్చినా, తన మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ పార్లమెంటు బిల్లు కూడా పాస్ చేసిందని, దేశం పురోగతి దిశగా ముందుకు సాగుతున్నదని పేర్కొన్నారు.ఓ గౌరవనీయ వ్యక్తి నుంచి, పార్టీ నుంచి ఇలాంటి కామెంట్లు రావడం చాలా అవమానకరమన్నారు. భారత్‌ను మాతగా పిలుచుకుంటామని, అలాంటిది మహిళలను ఇలాగా గౌరవించేది అంటూ మండిపడ్డారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…