Bandaru Satyanarayana : ఏపీ మంత్రి ఆర్కే రోజాపై మాజీ మంత్రి, టీడీపీ నేత బండారు సత్యనారాయణమూర్తి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై రోజా ఎమోషనల్ అయ్యారు.. మీడియా ముందుకు వచ్చి కన్నీటి పర్యంతమయ్యారు. బండారుపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేయగా.. కోర్టులో బెయిల్ వచ్చింది. అయితే సత్యనారాయణమూర్తి చేసిన వ్యాఖ్యలపై విమర్శల పర్వం కొనసాగుతుంది. తాజాగా ఈ వివాదంపై జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు, ప్రముఖ నటి ఖుష్బూ స్పందించారు. మహిళ మంత్రిపై బండారు వ్యాఖ్యలు దిగజారుడు తనానికి నిదర్శనం అన్నారు. ఆయన ఒక మనిషిగా కూడా విఫలమయ్యాడని.. వెంటనే రోజాకి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రధాని మోదీ తీసుకొచ్చారని.. ఇలాంటి తరుణంలో బండారు లాంటి వాళ్లు మహిళలపై ఇంత దారుణంగా మాట్లాడతారా అంటూ మండిపడ్డారు.రాధికా శరత్ కుమార్ కూడా ఈ వివాదంపై స్పందించింది. ఈ విమర్శల నేపథ్యంలో బండారు రోజాతో పాటు తనపై విమర్శలు చేసే వారికి కౌంటర్ ఇచ్చాడు.ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను రోజా దూషించడం వల్లే కొంత తీవ్రంగా స్పందించాల్సి వచ్చిందని సత్యనారాయణమూర్తి చెప్పారు. గతంలో రేణూ దేశాయ్ గురించి తప్పుగా మాట్లాడిన రోజాకి ఇప్పుడు అన్నీ గుర్తొచ్చాయా. జగన్ మా నాయకుడి భార్యని అనొచ్చా. వారు ఆడవాళ్లే కదా అంటూ చురకలంటించారు.
మంత్రి రోజాకు మద్దతుగా అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ ముందుకు వచ్చారు. బండారు వ్యాఖ్యలను ఖండిస్తూ వీడియో విడుదల చేసారు.”బండారు.. అసలు సిగ్గు ఉందా?. మంత్రి రోజా పై ఇంత దిగజారి మాట్లాడతారా అంటూ నిలదీసారు. మీ ఇంట్లో భార్య, చెల్లి, కూతురు లేరా అని ప్రశ్నించారు. తెలుగు రాష్ట్రాల్లో మహిళల్ని చాలా గౌరవిస్తారు. కానీ, ఈ బండారు మహిళల గౌరవాన్ని తగ్గించేలా మాట్లాడారని మండిపడ్డారు. మీకు రాజకీయాలు ముఖ్యమా.. లేకుంటే మహిళల గౌరవం ముఖ్యమా.. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోండంటూ నవనీత్ కౌర్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇలా వరుసగా మహిళలు స్పందించడం టీడీపీకి తలనొప్పిగా మారింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…