Nara Lokesh : నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర నాన్‌స్టాప్‌గా సాగిపోతుంది. కొద్ది రోజుల క్రితం కడపలో పర్యటించారు లోకేష్. కడప బిల్డప్ వద్ద నారా లోకేశ్‌కు తెదేపా నేతలు లక్ష్మిరెడ్డి, మన్మోహన్ స్వాగతం పలికారు. ఆయన పాదయాత్ర 1500 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా.. 1500 మంది మహిళలతో పసుపు చీరలు ధరించి స్వాగతం పలికే విధంగా ఏర్పాటు చేశారు. అనంతరం పలువురితో కలిసి మీటింగ్‌లో పాల్గొన్నారు. ఆ సమయంలో ఓ కడప కుర్రాడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మాకు నీళ్లు లేవు, నిధులు లేవు. ఇప్పటి ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకున్న దాఖలాలు లేవు అని అన్నారు.
మీ కాన్వాయ్‌పైన అప్పుడు దాడి చేసిన మమ్మల్ని ఏమి అనలేదు. కాని ఇప్పటి ప్రభుత్వం మాత్రం సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన దారుణంగా హింసిస్తుంది అని తన బాధని తెలియజేశారు. అయితే యువకుడి వ్యాఖ్యలను లోకేష్ చాలా ఆసక్తిగా విన్నారు. మా ప్రభుత్వం వచ్చాక మీకు తప్పక అండగా ఉంటామని తెలియజేశారు. ఈ ఏడాది జనవరి చివరిలో ప్రారంబమైన లోకేష్ పాదయాత్ర రాయలసీమ జిల్లాల్లో 124రోజుల పాటు సాగింది. 44నియోజక వర్గాల్లో 1587కిలోమీటర్ల పాటు లోకేష్ పాదయాత్ర సాగింది.
నారా లోకేష్ యువగళం పాదయాత్ర రాయలసీమ జిల్లాల్లో విజయవంతంగా పూర్తైంది. జనవరి 27 కుప్పంలో ప్రారంభమైన పాదయాత్ర సీమ జిల్లాల్లో 1587కిలోమీటర్ల పొడవున సాగింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 45రోజుల్లో 577కి.మీ పాదయాత్ర చేపట్టారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 40రోజుల్లో 507కి.మీ, అనంతపురం జిల్లాలో 23రోజుల్లో 303కి.మీ, కడప జిల్లాలో 16రోజుల్లో 200కి.మీ మేర పాదయాత్ర సాగింది. రాయలసీమలో 44 అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలో 108మండలాల్లో 943గ్రామాల మీదుగా లోకేష్ పాదయాత్ర సాగింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…