Anasuya : అందాల ముద్దుగుమ్మ అనసూయ ఇటీవలి కాలంలో ఎక్కువగా వార్తలలో నిలుస్తుంది. ఈ అమ్మడు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ని టార్గెట్ చేస్తూ ఏదో ఒక కామెంట్ చేస్తుంటుంది.ఈ క్రమంలో వారు కూడా అనసూయని ట్రోల్ చేస్తుంటారు. ముఖ్యంగా ఆంటీ అంటూ కామెంట్స్ చేస్తుంటారు. ఆ మధ్య ఈ పదానికి వ్యతిరేకంగా అనసూయ పెద్ద యుద్ధమే చేసింది. లైగర్ మూవీ మీద అనసూయ చేసిన పరోక్ష కామెంట్ చాలా వివాదాస్పదంగా మారింది. అమ్మను తిట్టిన పాపం ఇలా వెంటాడింది. అందుకే లైగర్ ప్లాప్ అనే అర్థంలో అనసూయ ట్వీట్ చేశారు. అనసూయ చర్యతో ఆగ్రహానికి గురైన విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఆమెపై ట్రోలింగ్ షురూ చేశారు. ఆంటీ అనే ట్యాగ్ ట్రెండ్ చేశారు.
ఆంటీ అని పిలవడం కూడా వేధింపుల క్రిందికి వస్తుంది. నేను కేసు పడతా అంటూ అనసూయ హెచ్చరించారు. అయినా కూడా విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ తగ్గలేదు. దాదాపు మూడు రోజులు అనసూయ-విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మధ్య మాటల యుద్ధం జరిగింది. అనసూయ కొందరి మీద సైబర్ క్రైమ్ విభాగంలో కంప్లైంట్ చేశారు. అంతకు ముందు కూడా అనసూయను ఆంటీ అంటూ కవ్వించేవారు. ఆమెకు పెళ్ళై ఇద్దరు పిల్లున్నారని, అందుకే ఆమె ఆంటీ అంటూ ఎద్దేవా చేసేవారు. అసలు ఆంటీ అంటే తనకు కోపం ఎందుకో వివరణ కూడా ఇచ్చింది అనసూయ.
ఆంటీ అని పిలిస్తే నాకు కోపం వస్తుంది. ఎందుకంటే వారి పిలుపు వెనుక వేరే అర్థం ఉంటుంది. అయితే ఈ మధ్య నాకు కోపం రావడం లేదు. ఈ ట్రోలర్స్ ని చక్కదిద్దడం కంటే ముఖ్యమైన పనులు ఎన్నో ఉన్నాయి అంటూ అనసూయ సమాధానం చెప్పింది. అయితే ఇటీవల జరిగిన విమానం మూవీ సక్సెస్ మీట్‌లో చైల్డ్ ఆర్టిస్ట్ అనసూయని ఆంటీ అని పిలిచింది. దీంతో అతడిని దగ్గరకి పిలిచి కిస్ ఇచ్చింది అనసూయ. నా పిల్లల కన్నా వీడు చిన్నవాడు. వాడు పిలుపులో ఎలాంటి అర్దాలు ఉండవు అంటూ ఆ బుడ్డోడితో సరదాగా మాట్లాడింది అనసూయ.
అనసూయ కామెంట్ వైరల్ అవుతుంది. అనసూయ మిగతా సెలెబ్రెటీలకు భిన్నం. ఆమె ట్రోలర్స్ ని అసలు సహించరు. హద్దు దాటి కామెంట్స్ చేస్తే ఫైర్ అవుతారు. చట్టపరమైన చర్యలకు వెనుకాడరు. ఆమె కంప్లైంట్స్ తో జైలుపాలైన వాళ్ళు చాలానే ఉన్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…