Nara Lokesh : సీఐడీకి దొర‌క్కుండా లోకేష్ త‌ప్పించుకుని తిరిగారా..?

Nara Lokesh : ఏపీ స్కిల్ డివ‌ల‌ప్‌మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన విష‌యం తెలిసిందే. చంద్ర‌బాబు నాయుడు అరెస్ట్ త‌ర్వాత ఏపీలో రాజ‌కీయం ఎంత ర‌చ్చ‌గా మారిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త్వ‌ర‌లో నారా లోకేష్ కూడా అరెస్ట్ కానున్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది.అయితే సీఐడీ నోటుసులపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణంలో ఏ14గా ఉన్న లోకేశ్.. రాష్ట్రం నుంచి ఢిల్లీకి పరారయ్యారని, 41ఏ నోటీసులు ఇచ్చేందుకు సీఐడీ అధికారులు ఢిల్లీ వెళ్తే.. లోకేశ్ తప్పించుకు తిరుగుతున్నారని వైసీపీ శ్రేణులు ఆరోపణలు చేస్తున్నాయి. సీఐడీ టీమ్ కి దొరక్కుండా లోకేశ్ దాగుడుమూతలు ఆడుతున్నారని, మీడియా కళ్లుగప్పి కార్లు మారుస్తూ రహస్యంగా మీటింగులు పెడుతున్నారంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తూ వైరల్ చేస్తున్నారు.

ఐటీసీ మౌర్య నుంచి మరో చోటుకు మకాం మార్చారని, గల్లా జయదేవ్ ఇంటికి కూడా రావడం లేదని ఆరోపిస్తున్నారు. వైఎస్సార్సీపీ శ్రేణులు చేస్తున్న ఈ ఆరోపణలపై తాజాగా నారా లోకేశ్ స్పందించారు.‘‘నేను ఎక్కడికి పోలేదు. సీఐడీ వాళ్ళు ఎవరు నా దగ్గరకు రాలేదు. వాళ్ళు వస్తే నోటీస్లు తీసుకుంటా. దాక్కునే అలవాటు నాకు లేదు. ఎవరో ఏదో ప్రచారం చేస్తే నాకేంటి సంబంధం? నేను ఢిల్లీ వచ్చిన నాటి నుంచి ఎక్కడ ఉంటున్నా అనేది అందరికీ తెలుసు. కావాలని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. ఎవరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు’’ అని పార్టీ నేతలకి, కార్యకర్తలకు, ప్రజలకు నారా లోకేష్ క్లారిటీ ఇచ్చారు. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు తాను ఉంటున్న ప్రాంతాల అడ్రస్‌తో సహా చెప్పి కౌంటర్ ఇచ్చారు.

Nara Lokesh got away from cid what is the truth
Nara Lokesh

సీఐడీ వాళ్లు వస్తే నోటీసులు తీసుకుంటానని, తనకు దాక్కునే అలవాటు లేదని వ్యాఖ్యానించారు. ఎవరో ఏదో ప్రచారం చేస్తే తనకేం సంబంధం అని ప్రశ్నించారు. తాను ఢిల్లీ వచ్చిన నాటి నుంచి ఎక్కడ ఉంటున్నాను అనేది అందరికీ తెలిసిన విషయమే అని చెప్పారు. కొంత మంది వ్యక్తులు కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని, ఎవరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని పార్టీ నేతలకు, కార్యకర్తలకు, ప్రజలకు నారా లోకేశ్ చెప్పారు. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు తాను ఉంటున్న ప్రాంతాల అడ్రస్ తో సహా చెప్పి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కౌంటర్ ఇచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ అక్టోబర్‌ 2న నారా భువనేశ్వరి నిరాహార దీక్ష చేయాలని నిర్ణయించారు. నంద్యాలలో చంద్రబాబును అరెస్ట్ చేసిన ప్రాంతంలోనే పొలిటికల్ యాక్షన్ కమిటీ సమావేశం జరిగింది. సమావేశం అనంతరం భవిష్యత్తు కార్యాచరణను అచ్చెన్న ప్రకటించారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

4 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

4 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago